Gossipsఫ్యాన్స్ కి వార్నింగ్ ఇచ్చిన విజయదేవరకొండ

ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇచ్చిన విజయదేవరకొండ

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి ఈ రెండు సినిమాలతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఇంచుమించు ఓ స్టార్ హీరోకి ఉన్న ఫాలోయింగ్ ఉన్న విజయ్ తన ఫ్యాన్స్ అసోషియేషన్ అని ఎవరైనా వస్తే ఇలాంటి పనులు వద్దు అని చెప్పి పంపిస్తున్నాడట. అదేంటి ఉన్నా లేకున్నా అభిమాన సంఘాలతో హడావిడి చేసే హీరోలు ఉన్నారు కదా అంటే.. అది వారి ఇష్టం.

కాని ఇవన్ని తనకు మాత్రం వర్క్ అవుట్ కాదని చెప్పాడట విజయ్ దేవరకొండ. ఫ్యాన్స్ అసోషియేషన్ అనగానే వారి అంచనాలకు తగ్గట్టు సినిమా తీయాలి. ఇక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుంటే బయటకు రావడం కుదరదు ఎప్పుడు సేఫ్ గేం ఆడుతూ ఉండాలి. అందుకే ఈ ఫ్యాన్స్ అసోషియేషన్స్ అంటూ ఏమి వద్దని తన ఫాలోవర్స్ కు చెబుతున్నాడట విజయ్ దేవరకొండ. మొత్తానికి హీరోల్లో తన సినిమాలే కాదు తన ఆలోచన విధానం కూడా వేరు అనేలా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news