Moviesనాగార్జున నువ్వు సూపరంతే..!

నాగార్జున నువ్వు సూపరంతే..!

ఆదివారం అంగరంగ వైభవంగా నాగ చైతన్య, సమంతల రిసెప్షన్ జరిగింది.. ఎన్ కన్వెన్షన్ లో ఆ కార్యక్రమం ముగించుకున్న అక్కినేని ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. అయితే నిన్న అన్నపూర్ణ స్టూడియోలో మనం సెట్ షార్ట్ సర్క్యూట్ వల్ల బూడిదయ్యింది. దాదాపు 2 కోట్ల దాకా నష్టం వచ్చిందని నాగార్జున అన్నారు. అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏం జరుగలేదు.

ఏయన్నార్ తో నటించిన మనం సినిమా సెట్ ఆయన జ్ఞాపకంగా అలా ఉంచారు. అయితే నిన్న అలా జరిగిందో లేదో నాగార్జున ఈరోజు మధ్యాహ్నం నుండి హలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాం అంటూ ట్వీట్ చేశాడు. నిజంగా మొన్న రిసెప్షన్ వేడుక నిన్న ఫైర్ యాక్సిడెంట్ ఇలా మంచి చెడు జరిగినా తన తదుపరి కార్యక్రమంపై నాగార్జున పెడుతున్న దృష్టి నిజంగా నాగ్ నువ్వు సూపరంతే అంటున్నారు.

జరిగిన దాని గురించి తలచుకుని బాధ పడటం కన్నా జరగాల్సిన దాని గురించి చూస్తే బెటర్ అలానే నాగ్ స్టూడియోలో సెట్ ప్రాపర్టీ బూడిదైనా దాని గురించి బెంగ పెట్టుకోకుండా వెంటనే సినిమా ప్రమోషన్స్ అంటూ ట్వీట్ చేయడం నాగార్జున వల్లే అవుతుందని అంటున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news