Gossipsవిలన్ క్యారక్టర్ కి సై అంటున్న ఆతమిళ్ హీరో...

విలన్ క్యారక్టర్ కి సై అంటున్న ఆతమిళ్ హీరో…

తమిళ హీరోలు తెలుగులో కూడా అదే రేంజ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. రజిని కమల్ తో మొదలుకుని విక్రం, సూర్య, కార్తి ఇలా తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు. అదే దారిలో విజయ్ కూడా ఇక్కడ క్రేజ్ సంపాదించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక తెలుగు వాడే అయినా తమిళ హీరోగా పాపులారిటీ తెచ్చుకున్న విశాల్ కూడా టాలీవుడ్ మార్కెట్ పై కన్నేశాడు.

ప్రస్తుతం విశాల్ నటించిన డిటెక్టివ్ సినిమా ఈ వారం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాటిస్పేట్ చేస్తున్న విశాల్ తనకు తెలుగులో అవకాశం వస్తే విలన్ గా అయినా నటించేందుకు సిద్ధమే అని అంటున్నాడు. ఇప్పటికే విలన్ గా తమిళ హీరో ఆది అదరగొడుతున్నాడు ఆ మైలేజ్ తో హీరోగా కూడా ఇక్కడ క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే విశాల్ కూడా విలన్ గా తెలుగులో అవకాశం వస్తే తప్పకుండా చేస్తా అంటున్నాడు.

మరి విశాల్ కోరికను తెలుగు దర్శక నిర్మాతలు నెరవేరుస్తారో లేదో చూడాలి. ఇక డిటెక్టివ్ సినిమా ఆల్రెడీ తమిళంలో రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాడు విశాల్. 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news