Gossipsఅక్కినేని గా మారనున్న విజయ్ దేవరకొండ

అక్కినేని గా మారనున్న విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి పెళ్లి చూపులు, సినిమాలతో ఫేమస్ అయిపోయాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. ఈ చిత్రంలో రీల్‌ లైఫ్‌ సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. సమంత కీలక పాత్ర పోషిస్తున్నారు.విజయ దేవరకొండ నటిస్తున్నాడన్న విషయం ఎప్పుడో రిలీవ్ అయ్యింది. అయితే, ఆయన ఏ పాత్రలో కనిపించబోతున్నాడనే తెలీలేదు.అయితే ఆయన అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఈ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, విజయ్‌ మంచి స్నేహితులట. వీరిద్దరూ గతంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలో కలిసి పనిచేశారు. అందుకే ఈ చిత్రంలో విజయ్‌ని అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు ఎంపికచేసినట్లు తెలుస్తోంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మహానటి’ బయోపిక్ ని అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సమంత కీలక పాత్రలో కనిపించనుంది. ఆమెది జర్నలిస్టు పాత్ర అని చెబుతున్నారు. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, శాలిని పాండే కూడా పలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news