Gossipsహీరోయిన్ కావాలంటే సిగ్గు వదిలేయాలి..!

హీరోయిన్ కావాలంటే సిగ్గు వదిలేయాలి..!

ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో తమ పట్ల జరుగుతున్న అన్యాయాలపై నోరు విప్పుతున్నారు. ఆ మద్య మాళీవుడ్ నటి భావనపై లైంగిక వేధింపుల తర్వాత చాలా మంది హీరోయిన్లు తమ పట్ల జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.  తాజాగా హీరోయిన్ కావాలంటే సిగ్గు వదిలెయ్యాలి అప్పుడే సరిగ్గా నటించగలుగుతారని డైరెక్టర్ గా చెబుతోంది బాలీవుడ్ బొద్దుగుమ్మ విద్యా బాలన్.

ఈ అమ్మడు భారీ అందాలను తెర నిండా పరిచేసి అందరికీ షాక్ ఇవ్వడమే కాకుండా కుర్రాళ్ళ కు మతి పోయేలా చేసింది. డర్టీ పిక్చర్ తో ఒక్కసారిగా తన పేట్ ని మార్చుకుంది ఈ భామ. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ గా రాణించాలంటే సిగ్గు, మొహమాటం అనేది వదిలేస్తే తప్పకుండా రాణిస్తారని లేకపోతే సినిమాల్లోకి రావడం దండగ అని చెబుతోంది.

పెళ్లి తర్వాత అమ్మడు ఫాం తగ్గినట్టు అనిపిస్తున్నా ప్రస్తుతం చేస్తున్న సినిమాల పబ్లిసిటీ కోసం అమ్మడు బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంది. ఇండస్ట్రీలో నెగ్గాలంటే ఇక్కడ పరిస్థితులకు తగ్గట్టు మారాల్సిందే అంటుంది విద్యా బాలన్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news