Gossipsశర్వానంద్.. తప్పులో కాలేస్తున్నాడా..!

శర్వానంద్.. తప్పులో కాలేస్తున్నాడా..!

ఈ మద్య టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా బాగా పెరిగిపోయింది. సీనియర్ హీరోల చిత్రాలు రేర్ గా వస్తున్న తరుణంలో అప్ కమింగ్ హీరోలు తమ జోరు పెంచారు. ఇక నాని, శర్వానంద్ లాంటి హీరోలు గత మూడు సంవత్సరాల నుంచి వరుసగా విజయాలు అందుకుంటూ మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలు లవ్ , ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలు కావడం గమనార్హం. దీంతో ప్రేక్షకులు కూడా ఈ తరహా చిత్రాలే ఎక్కువగా ఆదరిస్తున్నారు.

ప్రస్థానం లాంటి సీరియస్ యాక్షన్ సినిమా తర్వాత శర్వానంద్ ఆ తరహా సినిమాల్లో నటించలేదు. తాజాగా ఇప్పుడు మళ్ళీ సీరియస్ పాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు శర్వానంద్. సుధీర్ వర్మ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ గా నటించడానికి శర్వా ఒప్పుకున్నాడు పైగా అందులో ద్విపాత్రాభినయం పోషించనున్నాడట. విభిన్న కథా చిత్రం అని చేస్తున్నాడు హిట్ అయితే ఓకే కానీ ప్లాప్ అయితే మాత్రం విజయాల పరంపర కు బ్రేక్ పడినట్లే ఇక. సీరియస్ పాత్ర అంటే మళ్ళీ ప్లాప్ ల బారిన పడతాడా .. శర్వా తప్పు చేస్తున్నాడా చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news