యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి సక్సెస్‌ను దక్కించుకున్నాడు. హీరోగా సినిమాలు మానేసి విల్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను కొనసాగిద్దామని భావిస్తున్న తరుణంలో గరుడవేగ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను రాజశేఖర్ అందుకున్నాడు. గరుడవేగ చిత్రానికి ముందు రాజశేఖర్ ఒక స్టార్ హీరో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు ఓకే చెప్పాడు. కాని చివరి నిమిషంలో కథ మరియు పాత్ర నచ్చక పోవడంతో తప్పుకున్నాడు. కొన్ని విలన్ పాత్రలకు కూడా ఆఫర్లు వచ్చాయి. కాని వాటిల్లో మంచి పాత్ర లేకపోవడంతో ఒప్పుకోలేదు. ఒక వేళ ఆయనకు నచ్చిన పాత్ర లభించి ఉంటే ఇప్పటి వరకు ఆయన విలన్‌గా లేదా కార్యక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయేవాడు.
గరుడవేగ సక్సెస్ తర్వాత రాజశేఖర్ తన ఆలోచన మార్చుకున్నాడు. తన తోటి హీరోలు ఇంకా కూడా హీరోలుగా కొనసాగుతున్న సమయంలో తాను ఎందుకు విలన్ వేశాలు వేయాలి, మంచి కథ, మంచి దర్శకుడితో సినిమాలు చేస్తే హీరోగా ఇంకా తాను చాలా కాలం ప్రేక్షకులను అలరించగలను అని రాజశేఖర్ భావిస్తున్నాడట.
అందుకే రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయాలనే ఆలోచనను పక్కన పెట్టేశాడని తెలుస్తుంది. సంవత్సరంకు ఒకటి లేదా రెండు చొప్పున మంచి కథలు మంచి పాత్రలతో హీరోగానే చేయాలని డిసైడ్ అయ్యాడట. మంచి కథ వచ్చే వరకు ఎదురు చూస్తాను తప్ప ఏ కథ పడితే ఆ కథను చేసి హీరోగా తన స్థాయి తగ్గించుకోనంటూ రాజశేఖర్ చెబుతున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే మరో అయిదు పది సంవత్సరాల వరకు రాజశేఖర్‌ను విలన్‌గా చూడమేమో అనిపిస్తుంది.