Gossipsస‌మంత‌కు షాక్ ఇస్తోన్న హీరోయిన్ ఎవ‌రు...

స‌మంత‌కు షాక్ ఇస్తోన్న హీరోయిన్ ఎవ‌రు…

వరస విజయాలతో దూసుకుపోతున్న కాజల్ కు సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అవకాశాలు ఇస్తూ ఉండటంతో ఆమె ప్రస్తుతం బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవల కాజల్ ఒకఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటో షూట్ చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఈమె రీసెంట్‌గా రిట్జ్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటోషూట్ ను చూసి అందరి మైండ్స్ బ్లాంక్ అయిపోతున్నాయి. యంగ్ హీరోయిన్స్ సినిమా అవకాశాల కోసం ఇచ్చే ఎక్స్ పోజింగ్ స్థాయిలో ఈ ఫోటో షూట్ ఉంది.

ఈమధ్య కాలంలో క్లీవేజ్ ప్రదర్శనలు కామన్ అయిన నేపధ్యంలో మరిన్ని అవకాశాలు అందుకోవడం కోసం కాజల్ ఇటువంటి ఫోటోషూట్ ఇచ్చింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆమెకు చేతినిండా సినిమాలు ఉన్నా తన పై ఏజ్ బ్రాండ్ పడకుండా జాగ్రత్త పడేందుకు ఇటువంటి ఫోటో షూట్ ఇచ్చి ఉంటుంది అని మరికొందరు అంటున్నారు. ఇది ఇలా ఉండగా సమంతకు చైతూతో పెళ్ళి అయిన నేపధ్యంలో ప్రస్తుతం సమంత చేతిలో ‘రంగస్థలం’ మినహాయిస్తే మరో పెద్ద సినిమా ఏదీలేదు.

దీనికి తోడు సమంతను పెళ్ళి తరువాత ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే సంగతి ‘రంగస్థలం’ రిలీజ్ అయ్యాక మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతం కాజల్ నటిస్తున్న సినిమాలు అన్నీ వరస హిట్స్ గా మారుతున్న పరిస్థుతులలో ఆమెకు వరసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. వెంకటేష్ – శర్వానంద్ ఇలా చాలామంది హీరోలతో జత కడుతోంది కాజల్. ఒకవిధంగా సమంతకు రావలసిన అవకాశాలు అన్నింటిని కాజల్ ఎగరేసుకుపోతోంది. ప్రస్తుతం కాజల్ హవా నడుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news