గ‌రుడ‌వేగ హిట్ క్రెడిట్ బాల‌య్య‌కేనా..!

ఒకప్పుడు స్టార్ హీరోగా ఎన్నో హిట్ సినిమాలు అందించిన హీరో రాజశేఖర్ ఈ మధ్య కాలంలో కుర్ర హీరోల జోరు తట్టుకోలేక బాగా వెనుకబడిపోయాడు. ఆయన హిట్టు సినిమా తీసి చాలా సంవత్సరాలే అయ్యింది. దీంతో ఇక రాజశేఖర్ కెరియర్ ముగిసిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో అనుకోకుండా ఆయన ఇటీవల నటించిన గరుడ వేగా చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడంతో హమ్మయ్య చాలా సంత్సరాల తరువాత ఒక హిట్ వచ్చిందని రాజశేఖర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా హిట్ అవ్వడానికి నందమూరి హీరో బాలకృష్ణ కూడా పరోక్ష కారణమని బాలయ్య అభిమానులు కూడా ఆ క్రెడిట్ అంతా మా హీరోదే అని చెప్పుకుంటున్నారు. ఎవరు ఎలా చెప్పుకుంటే ఏంటి మాకు కావాల్సింది హిట్టు అని రాజశేఖర్ దంపతులు ఖుషీగా ఉన్నారు.

సుమారు 25 కోట్ల రూపాయల భారీ వ్యయం  తో నిర్మించిన ‘గరుడవేగ’ చిత్రానికి ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించారు . ఈ సినిమా ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చెయ్యడంతో పాటు ఈ సినిమా హిట్ కావడం కోసం మంచి ప్రమోషన్ కూడా ఇచ్చారు. ‘గరుడవేగ’ సినిమా గురించి బాలయ్య ఫ్యాన్స్ పాజిటివ్ గా ప్రచారం చేశారు.‘గరుడవేగ’ సినిమాకు ముహూర్తం చూసిందే బాలయ్య. ఈ సినిమా ఆడియో వేడుకకు కూడా వచ్చి ప్రమోషన్ కు  సాయం చేశాడు బాలయ్య. ఆ సందర్భంగా బాలయ్య గురించి రాజశేఖర్.. రాజశేఖర్ గురించి బాలయ్య చాలా పాజిటివ్ గా మాట్లాడారు.

దీని వల్ల బాలయ్య అభిమానుల్లో రాజశేఖర్ మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. పైగా దశాబ్దం పాటు హిట్టు లేక సతమతమయ్యాడన్న సానుభూతి కూడా ఆయన మీద ఉంది. దీంతో ‘గరుడవేగ’ సినిమా గురించి బాలయ్య ఫ్యాన్స్ పాజిటివ్ గా ప్రచారం చేశారు. ఏది ఏమైనా ఇలా ఒక హీరో  సినిమా గురించి మరో హీరో కష్టపడడం, పాజిటీవ్ గా ప్రచారం చెయ్యడం దానికి అభిమానులు కూడా సహకరించడం ఇండ్రస్ట్రీలో శుభపరిణామం అని సినీ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a comment