Gossipsలక్ష్మీపార్వ‌తిని దేవ‌త అని కీర్తించిన ఆ డైరెక్ట‌ర్

లక్ష్మీపార్వ‌తిని దేవ‌త అని కీర్తించిన ఆ డైరెక్ట‌ర్

సినిమా రూపొంద‌క ముందే ఇన్ని వివాదాలు పోగేసుకుంటున్న చిత్రం ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం

ఈ చిత్ర తీయొద్ద‌ని ఓ వైపు ద‌ర్శ‌కుడిని కొంద‌రు బెదిరిస్తున్నార‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు ఈ యుద్ధం టీడీపీ వెర్స‌స్ వైఎస్సార్ సీపీ అన్న‌ట్లు ఉంద‌ని ప‌రిశీలకులు వినిపిస్తున్న వాద‌న‌

ఇంత‌కూ నిజ‌మేంటి??

‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాకు సంబంధించి తాను ఓపెన్ డిబేట్ కు రెడీ అని సవాలు విసిరాడు జగదీశ్వర్ రెడ్డి. ఈ చర్చకు ఎంతమంది అయినా రావచ్చని.. వచ్చిన వాళ్లలో పది శాతం మంది లక్ష్మీపార్వతి దేవత అని అన్నా.. తాను ఈ సినిమా తీయకుండా ఆపేస్తానని ఆయన అన్నారు. ఈ సినిమా తీయొద్దంటూ తనకు బెదిరింపులు వస్తున్నట్లు చెప్పారు. కానీ తాను ముందు చెప్పినట్లే వచ్చే ఏడాది నవంబరు 12న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ విడుదలవుతుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా తీసేందుకు అవసరమైన ఇన్ పుట్స్ కోసం జగదీశ్వర్ రెడ్డి తన బృందంతో కలిసి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. లక్ష్మీపార్వతి మాజీ భర్త వీరగంధం వెంకట సుబ్బారావు సొంత ఊరు వినుకొండకు కూడా వెళ్లి ఆయన వివరాలు సేకరించనున్నారు. అలాగే లక్ష్మీపార్వతి సొంత ఊరికి కూడా ఆయన వెళ్ల‌నున్నాన‌ని కేతిరెడ్డి తెలిపారు.మరోవైపు వ‌ర్మ సినిమా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌పై కూడా కొన్నివివాదాలు ఉన్నాయి. ఆయ‌న కూడా త‌న‌ని త‌ప్పుగా చూపితే ఒప్పుకోన‌ని లక్ష్మీపార్వ‌తి చెబుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news