అసలే ఆ సినిమా బాలయ్య… పూరి కాంబినేషన్ అందులోనూ ట్రైలర్ చుసిన వాళ్లకు కూడా ఆ సినిమాలో ఏదో ఉంది అనిపించేలా ఉంది. ఇంకేముంది బయ్యర్లు వెనుక ముందు ఆలోచించలేదు సరికదా బాలకృష్ణ మార్కెట్ కంటే ఎక్కువ రేటు పెట్టి ఆ సినిమా కొనుగోలు చేశారు. ఇంకేముంది సినిమా రిలీజ్ అయ్యింది హిట్ టాక్ కూడా వచ్చింది అయితే లాభం ఏముంది బయ్యర్లకు మాత్రం ఆ సినిమా పైసా వసూల్ చేయలేక వాళ్ళ నెత్తి మీద పిడుగుపడేటట్టు చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా అదేనండి అరే మామా ఏక్ పెగ్ లా అంటూ బాలయ్య స్టెప్పులేసిన పైసా వసూల్.
ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు చూసి హమ్మయ్య అనుకున్నారు బయ్యర్లు.. కానీ ఆ సంతోషం వారికి ఎన్నో రోజులు నిలవలేదు ఎందుకంటే మొదటి వారం తరువాత ఘోరమైన కలెక్షన్ లు వస్తుండడం చూసి ఒక్కసారిగా బయ్యర్లు ఢీలాపడిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూల్ చేసింది మాత్రం కేవలం రూ. 15 కోట్లు మాత్రమే. కానీ బయ్యర్లు కొనుగోలు చేసింది మాత్రం రూ. 32 .5 కోట్లు. దీంతో లబోదిబోమంటూ బయ్యర్లు గుండెలు బాదుకున్నారు.
ప్రస్తుతం మళ్లీ బాలకృష్ణ నటించిన 102వ సినిమా జై సింహా జనవరిలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సీ కళ్యాణ్ నిర్మాతగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మాత్రం ఆచితూచి కొనుగోలు చెయ్యాలని చూస్తున్నారు బయ్యర్లు. ఎందుకంటే బాలయ్య గత సినిమాతో వారికీ బాగా జ్ఞానోదయం అయినట్టు ఉంది అందుకే ఇలా ముందు జాగ్రత్తపడుతున్నారు.