రాజ‌శేఖ‌ర్ సేఫ్

గ‌రుడ వేగ హిట్ తో రాజ‌శేఖ‌ర్ పండుగ చేసుకుంటున్నాడు. ఎంతో రిస్క్ చేసి రిలీజ్ చేసిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవ‌డంతో ఆ ఇంట సంబ‌రాలు మిన్నుముడుతున్నాయి. నిర్మాత జీవిత, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరో రాజశేఖర్, ఇంకా మరి కొందరు కలిసి ఈ సినిమా కోసం మూడు కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారు.అంతేకాదు సినిమాను ఆంధ్రలో సురేష్ మూవీస్ దగ్గర, సీడెడ్ లో సాయి కొర్రపాటి దగ్గర ఉంచారు.

నైజాంలో మర్కాపురం శివకుమార్ కోటి రూపాయిల అడ్వాన్స్ పై ఆడిస్తా అన్నారు. కానీ మరి ఈ మూడు కోట్ల ఫైనాన్స్ క్లియరెన్స్ ఎలా? థియేటర్ల అడ్వాన్స్ లు ఇలాంటివి ట్రయ్ చేసారు కానీ కాలేదని వినికిడి.గురువారం ఉదయం నుంచి అర్ధ‌రాత్రి దాటేవరకు ప్రయత్నాలు సాగాయి. కానీ ఫలించలేదని తెలుస్తోంది. ఆఖరికి రాజశేఖర్ తన స్వంత కమర్షియల్ ఏరియాలో సుమారు అయిదువేల ఎస్ ఎఫ్ టి ని గ్యారంటీగా సేల్ డీడ్ రాయడంతో ఫైనాన్స్ క్లియరింగ్ లెటర్ చేతికి అందినట్లు తెలుస్తోంది.ఇప్పుడు సినిమాకు హిట్ టాక్ వచ్చింది క‌నుక ప్రాబ్ల‌మ్ క్లియ‌ర్.

Leave a comment