అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు ఉంటుంది ఒక్కసారి పరిస్థితి. ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే కాలం కలిసిరాకపోతే ఏవారైనా ఏమీ చేయలేరు కదా ! తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంన్నాడు ఓ టాప్ డైరెక్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు “గబ్బర్ సింగ్” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. ఈ విషయంలో హరీష్ గర్వపడుతుంటాడు. అయితే, ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్’ లాంటి హిట్ హరీష్ కు అందలేదు.
ఈ సంవత్సరం రీసెంట్గా హరీష్ స్టైలీష్స్టార్ అల్లు అర్జున్ తో చేసిన ‘డీజే’ సూపర్ హిట్టయ్యింది. ఈ హిట్ తో అవకాశాలు పెరుగుతాయని హరీష్ భావించాడు. కానీ అవకాశాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టు అయిపొయింది హరీష్ పని. డీజే తర్వాత దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేసేందుకు హరీష్ ప్లాన్ చేశాడు. ఫారిన్ వెళ్లి లొకేషన్స్ కూడా చూసొచ్చాడు.
మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నా. స్టార్ హీరోలు నటించే అవకాశం ఉందని చెప్పుకొన్నాడు. కానీ, ఇంత వరకు హరీష్ కు హీరో దొరకలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ హీరో డేట్స్ కూడా దొరకడం లేదట. మరి కథకు తగ్గ హీరో దొరికే వరకు ఈ యంగ్ డైరెక్టర్ వేచి ఉంటాడో లేఖ ఎవరు ఖాళీ అయితే వారితో కమిట్ అయిపోతాడో చూడాలి మరి !