వర్మ మరీ ఓవర్‌ చేయకు.. ఇక ఆపేయ్‌

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర సినిమా గురించి తెగ సందడి చేస్తున్నాడు. వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అనే సినిమా రంగం సిద్దం అవుతుంది. ఈ సమయంలోనే లక్ష్మీస్‌ వీరగ్రంధం అనే చిత్రాన్ని చేసేందుకు కేతిరెడ్డి జగదీస్‌ రెడ్డి అనే వ్యక్తి ప్రయత్నాలు ప్రారంభించాడు. తన సినిమాకు పోటీగా కేతిరెడ్డి తెరకెక్కించబోతున్న సినిమాపై వర్మ గత కొన్ని రోజులుగా వరుసగా తనదైన శైలిలో వ్యంగ్యాస్తాలు సంధిస్తున్నాడు. దర్శకుడు కేతిరెడ్డిపై, ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్‌పై, ఆ సినిమాపై వస్తున్న వివాదాలపై వర్మ తనదైన రీతిలో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తున్నాడు.

fEf9s9CE

DMb7N_aVAAAkmCf DMVswUwUQAUz9yL

కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్‌ వాయిస్‌తో ఒక వీడియోను విడుదల చేసిన వర్మ తాజాగా మరో వీడియోను అదే ఎన్టీఆర్‌ వాయిస్‌తో విడుదల చేయడం జరిగింది. ఈసారి విడుదల చేసిన వీడియోలో కేతిరెడ్డి జగదీస్‌ రెడ్డి గురించి ఎక్కువగా ప్రస్తావించాడు. నువ్వు తయారు చేసిన స్క్రిప్ట్‌ చాలా బాగా నచ్చింది. నీకు ఎవరు అడ్డు రారు. లక్ష్మీ పార్వతి గారు మహాసాద్వి. ఆమె నీ సినిమాకు ఎలాంటి అవాంతరాలు సృష్టించరు. మీరు సినిమా తీసి చరిత్ర సృష్టించండి అంటూ ఆ వీడియోలో ఎన్టీఆర్‌ వాయిస్‌తో కేతిరెడ్డిని ఆశ్వీర్వదిస్తున్నట్లుగా ఉంది.

వర్మ చేస్తున్న ఇలాంటి సిల్లీ వీడియోలను, విమర్శలను కొందరు నందమూరి ఫ్యాన్స్‌ తప్పుబడుతున్నారు. ఎన్టీఆర్‌ వాయిస్‌ అంటూ, అన్నగారి పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు, ఇకనైనా ఆపేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Leave a comment