మాస్ మహారాజా రవితేజ కిక్ 2, బెంగాల్ టైగర్ సినిమాలు నిరాశ పరచడంతో, ఆ చిత్రాల తర్వాత ఈయన దాదాపు రెండు సంవత్సరాల బ్రేక్ తీసుకున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ రాజా ది గ్రేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు బ్యానర్‌లో తెరకెక్కిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రాజా ది గ్రేట్ చిత్రం రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించింది. మొదటి సారి రవితేజ 50 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాతో రవితేజ స్థాయి అమాంతం పెరింది. అందుకే పారితోషికం కూడా పెంచేశాడని టాక్.
ప్రస్తుతం రవితేజ టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి ఆ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రవితేజ తన తర్వాత సినిమాలను కమిట్ కాలేదు. ఇటీవలే ఈయన వద్దకు ఒక తమిళ రీమేక్‌తో పాటు, తెలుగు సినిమా ఛాన్స్‌లు వచ్చాయి. పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు అవ్వడంతో పాటు మంచి దర్శకులు అవ్వడం వల్ల రవితేజ ఒప్పుకుంటాడని అంతా భావించారు. కాని ఆ రెండు చిత్రాలను కూడా రవితేజ పారితోషికం కారణంగా వదులుకున్నాడు.
ఆ నిర్మాతలు రవితేజ డిమాండ్ చేసిన పారితోషికాన్ని ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఆ స్థాయిలో పారితోషికం ఇవ్వడం తమ వల్ల కాదని ఆ నిర్మాతలు చేతులెత్తేశారట. దాంతో ఆ సినిమాలు ఆగిపోయాయి. తాను డిమాండ్ చేసిన పారితోషికంకు ఓకే చెప్తేనే రవితేజ తర్వాత సినిమా చేసే అవకాశం ఉంది. రవితేజ భారీగా పెంచిన పారితోషికం ఇప్పుడు నిర్మాతలకు షాక్ ఇస్తుంది.