సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న స్వీటీ, సైజ్ జీరో సినిమా కోసం చేసిన ప్రయోగం తన కెరీర్ మీదే ప్రభావం చూపించింది. ఆ సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత తగ్గేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక దశలో ఆమె కెరీర్ ముగిసిపోయింది అనే పుకార్లు కూడా గట్టిగానే వినిపించాయి. ఈ దశలో ఆమె తన లుక్ మొత్తాన్ని మార్చుకుని కొత్త స్టయిలే లో కనిపించబోతోంది.
ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె ఫోటో ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ‘సైజ్ జీరో‘ సినిమా కోసం ఆ సుందరి బరువు పెరిగి వామ్మో అనిపించేలా తయారయ్యింది. ఆ తర్వాత బాహుబలి 2 కోసం సన్నబడటానికి ఆమె ప్రయత్నించినా అది వర్కవుట్ అవ్వలేదు. చివరికి టెక్నాలజీ సహాయంతో ఆమె ను సన్నగా చూపించాల్సి వచ్చింది. ఇలా అయితే తన సినీ కెరీర్ ముగిసిపోయినట్లే అనుకుందో ఏమో కానీ స్లిమ్ గా మారిపోయింది.
నేను నాజుగ్గా మారానంటూ తాజా ఫొటోను ఆమె ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసింది. కొత్త అందంతో, బాబ్డ్ హెయిర్ తో ఆమె సరికొత్తగా కనిపిస్తోంది. ఈ ఫొటో కింద ఆమె ఓ కామెంట్ కూడా పోస్ట్ చేసింది. ‘మంత్ర, తంత్రాల ద్వారా కలలు నిజ రూపం దాల్చవు. అది సాధ్యం కావాలంటే చెమట చిందించాలి. కష్టించే తత్వం, పట్టుదల, దృఢ సంకల్పం అవసరం‘ అని పేర్కొంది. అనుష్క తాజా చిత్రం ‘భాగమతి‘ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుష్క స్లిమ్ ఐయిపోయింది కాబట్టి ఇక అవకాశాలు తన్నుకుంటూ వచ్చేస్తాయేమో చూడాలి