Moviesఒక్క క్షణం పోస్టర్.. అల్లు శిరీష్ కొత్త ప్రయత్నం..!

ఒక్క క్షణం పోస్టర్.. అల్లు శిరీష్ కొత్త ప్రయత్నం..!

మెగా సపోర్ట్ తో అల్లు ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన అల్లు శిరీష్ ఇంకా స్టార్ క్రేజ్ దక్కించుకోవడంలో వెనుకపడ్డాడు. లాస్ట్ ఇయర్ శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హిట్ అందుకోగా కొద్దిపాటి గ్యాప్ తో వి.ఐ.ఆనంద్ తో ఒక్క క్షణం సినిమా చేశాడు అల్లు శిరీష్. సురభి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది.
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకున్న వి.ఐ.ఆనంద్ మరోసారి అలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ తోనే ఒక్క క్షణం చేశాడని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అనిపిస్తుంది. పోస్టర్ తో సినిమా మీద పాజిటివ్ ఫీల్ కలిగేలా చేయగా సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఎక్సయిటింగ్ లో ఉన్నారు మెగా అభిమానులు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు.
డిసెంబర్ 23న బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా అల్లు శిరీష్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. నాని ఎం.సి.ఏ డిసెంబర్ 21, అఖిల్ హలో 22న వస్తుండగా ఆ రెండు సినిమాల తర్వాత వస్తున్న ఈ ఒక్క క్షణం ఎలా ఉంటుందో అని సిని ప్రియులు అంచనాలేస్తున్నారు.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news