స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంభందించి యాక్షన్ సీన్స్ ని కూడా చిత్రీకరించారు. ఇప్పుడా సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయని దర్శకుడు వంశీ తెగ మురిసిపోతున్నాడు.
ఇదంతా బన్నీ క్రెడిట్ గానే వంశీ చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఆ యాక్షన్ ఏపీసోడ్స్ చాలా రిస్స్ తో కూడుకొన్నవి అట. వాటిని బన్నీ ఎలాంటి డూబ్ లేకుండా స్వయంగా చేశాడట. వాటిని తెరపై చూసిన ప్రేక్షకులు ఖచ్చితంగా థ్రిల్ కి గురవుతారని వంశీ చెప్పుకొంటున్నాడు.
దర్శకుడు వక్కంతం వంశీకి ఇదే తొలి సినిమా. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాని వచ్చే యేడాది ఏప్రిల్ 27న ర్ రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారు. అదే రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు‘భరత్ అను నేను‘ కూడా ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది. దీంతో స్టయిలీష్ స్టార్, సూపర్ స్టార్ ల బాక్సీఫీసు ఫైట్ తప్పేలా కనిపించడంలేదు.