Gossipsఅదిరిందిని అడ్డుకుంటున్న మెగా క్యాంప్‌ ఎందుకో తెలుసా ?

అదిరిందిని అడ్డుకుంటున్న మెగా క్యాంప్‌ ఎందుకో తెలుసా ?

తమిళంలో విజయ్‌ హీరోగా సమంత, కాజల్‌లు హీరోయిన్స్‌గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన సినిమా మెర్సెల్‌. భారీ అంచనాల నడుమ రూపొందిన మెర్సల్‌ సినిమా తమిళనాట వివాదాస్పదం అయ్యి విడుదల తర్వాత బీజేపీ నుండి వ్యతిరేకత ఎదుర్కొన్న విషయం తెలిసిందే. సినిమాలో జీఎస్టీకి సంబంధించి వ్యతిరేక డైలాగ్స్‌ ఉన్నాయి అంటూ బీజేపీ నాయకులు ఆందోళనలు చేయడంతో ఆ డైలాగ్స్‌ను తొలగించడం జరిగింది. తాజాగా మెర్సల్‌ చిత్రాన్ని తెలుగులో అదిరింది అనే టైటిల్‌తో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇప్పటికే అదిరింది విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా వరుసగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. మొదట సెన్సార్‌ సమస్య ఎదురవ్వగా ఇప్పుడు మెగా క్యాంపు వారు ఈ సినిమాను విడుదల కానివ్వడం లేదు అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. పవన్‌కు మెర్సల్‌ చిత్రంను రీమేక్‌ చేయాలనే కోరిక ఉంది. కాని పవన్‌తో విభేదాలు పెట్టుకున్న శరత్‌ మరార్‌ మాత్రం రీమేక్‌ రైట్స్‌ను ఇచ్చేందుకు సిద్దంగా లేడు.

డబ్బింగ్‌ చేసి వదలాలని భావిస్తున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ కోసం అల్లు అరవింద్‌ తెర వెనుక సినిమా విడుదల కాకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈనెల 9న విడుదల కావాల్సి ఉన్న అదిరింది సినిమాను మళ్లీ వాయిదా వేసే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతుంది. అసలు అదిరింది విడుదల అవుతుందా లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news