Gossipsరంగస్థలం చూపించిన రామ్ చరణ్..!

రంగస్థలం చూపించిన రామ్ చరణ్..!

ఒకప్పుడు సినిమాలు రాకముందు వీధి నాటకాలు, స్టేజి షోల ద్వారా కళాకారులు ప్రేక్షకులను అలరించారు. ఇక భారత దేశంలో వివిధ కళా సంస్కృతులు మేళవించిన రంగస్థలంపై నటించి మెప్పించేవారు. రాను రాను ఆ కళలు అంతరించి పోసాగాయి.. గ్రామాల్లో సైతం రంగస్థలంపై నాటకాలు వేసేవారు కనుమరుగవుతున్నారనే చెప్పొచ్చు. తాజాగా మెగాస్టార్ వారసుడు రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం 1985 శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.1 2

దాదాపు గ్రామీణ వాతావరణం కళ్ల ముందు ఉండేలా ఇప్పటి వరకు లోకేషన్స్ కి సంబంధించిన ఫోటోలను బట్టి తెలుస్తుంది. తాజాగా ఓ పాట షూటింగ్ జరుగుతున్నట్లు రామ్‌చరణ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. సినిమా సెట్‌లో తీసిన ఒక ఫొటోను ఎఫ్బీలో షేర్ చేసిన చెర్రీ.. రంగస్థలం లో పండగ సందడి కొనసాగుతోందని అని కామెంట్ పోస్ట్ చేశాడు.3 4

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ డైరెక్టర్. సమంత హీరోయిన్ గా నటిస్తుండగా.. అనసూయ, జగపతిబాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.5rangastalam (1)

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news