సిద్దూకి ఈ ‘గృహం’ కలిసి వస్తుందా..!

బాయ్స్ హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత తెలుగులో బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, కొంచె ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాలతో మంచి విజయం అందుకున్న సిద్దార్థ గత కొంత కాలంగా తెలుగు తెరకు దూరమయ్యాడు. వాస్తవానికి మనోడు ఆ మద్య నటించిన ఒక్క సినిమా హిట్ కాకపోవడంతో తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అక్కడ కూడా పెద్దగా కలిసి రాకపోవడంతో ఈ సారి హర్రర్ కాన్సెప్ట్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సిద్ధార్థ్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్స్‌పై సిద్ధార్థ్‌, ఆండ్రియా కలిసి నటించినసినిమా గృహం. మిలింద్‌ రావ్‌ దర్శకుడు. భయానికి భాష అక్కర్లేదు కాబట్టి, ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. తెలుగు ఇండస్ట్రీ నన్ను హీరోగా ఎంతో బాగా ఆదరించింది. తెలుగులో సినిమాలు చేయడం కాస్త ఆలస్యమై ఉండొచ్చు కానీ, మిస్‌ మాత్రం కాను అంటున్నాడు సిద్దార్థ. ఈ సినిమా నవంబర్‌ 3న విడుదల చేయబోతున్నారు. మరి ఈసారైనా మనోడికి ‘గృహం’కలిసి వస్తుందా లేదా చూడాలి.

Leave a comment