రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే యువతకు పూనకమే. ఎలాంటి సినిమా అయినా సరే తన మ్యూజిక్ తో మరో లెవల్ కు తీసుకెళ్లే మ్యూజిక్ మిరకిల్ దేవి శ్రీ ప్రసాద్. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ మ్యూజిక్ డైరక్టర్ కాబట్టి దేవి మ్యూజిక్ కోసం దర్శక నిర్మాతలు తను అడిగిన ఫెసిలిటీస్ ఏర్పరచాల్సిందే. ముఖ్యంగా స్టార్ సినిమా అంటే దేవి ఫారిన్ లో సిట్టింగ్స్ డిమాండ్ చేస్తాడని టాక్.
పెద్ద సినిమాలకు అక్కడ ఒంటరిగా ట్యూన్స్ ఆలోచించి వచ్చి ఇక్కడ రికార్డింగ్ పెట్టుకుంటాడట. అయితే దేవి సిట్టింగ్ ఖర్చులన్ని నిర్మాత భరించాల్సిందే. దర్శకుడితో ఈ సిట్టింగ్ ఉంటాయని తెలుస్తుంది. పూరి బ్యాంకాక్ వెళ్లి కథ రాసుకొని వచ్చినట్టు దేవి యూఎస్ వెళ్లి సాంగ్స్ కంపోజ్ చేస్తాడట. ఇది నిర్మాతకు అదనపు భారమే అయినా అక్కడ చేస్తేనే కాని మ్యూజిక్ అనరు అన్న ప్రవర్తన ఉంటుందట దేవిలో. పొరపాటిన ఎవరైనా ఇక్కడ ఉండే ఇవ్వమంటే అందుకు తగ్గట్టుగానే పాటలు ఉంటాయట.
మరి దేవి ఈ వ్యత్యాసం ఏంటో తెలియదు కాని దేవి ఫారిన్ సిట్టింగుల గురించి వచ్చిన ఈ న్యూస్ నిజంగా షాకింగ్ గానే ఉంది. ప్రస్తుతం దేవి వంశీ పైడిపల్లి మహేష్ కాంబోలో వస్తున్న సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నాడు. సినిమా సాంగ్స్ కంప్లీట్ చేసుకుని డిసెంబర్ లో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.