Gossipsపవన్, బాలయ్య తో పోటీపడనున్న రవితేజ

పవన్, బాలయ్య తో పోటీపడనున్న రవితేజ

బెంగాల్ టైగర్ తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్న మాస్ మహరాజ్ రవితేజ రీసెంట్ గా వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. రవితేజ కెరియర్ లో హయ్యెస్ట్ కలక్షన్స్ వచ్చేలా ఉన్న ఈ సినిమాను అనీల్ రావిపుడి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో పార్లర్ గా తెరకెక్కిన టచ్ చేసి చూడు కూడా దాదాపు ముగింపు దశకు చేరుకుంది.

విక్రం సిరి డైరక్షన్ లో వస్తున్న ఆ సినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుందట. అయితే డిసెంబర్ నెల మొత్తం క్రేజీ సినిమాల రిలీజ్ ఉండటంతో జనవరిలో టచ్ చేసి చూడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే పొంగల్ వార్ లో పవన్ త్రివిక్రం మూవీ ఫిక్స్ చేయగా.. బాలయ్య జై సింహా వస్తున్నాడు. వీటి మధ్యలో రాజ్ తరుణ్ కూడా ఈసారి స్టార్ వార్ కు సిద్ధమయ్యాడు.

ఈ మూడు సినిమాలను టచ్ చేస్తూ వస్తున్నాడు రవితేజ. ఈ సినిమా హిట్ అయితే బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో రవితేజ మళ్లీ ఫాంలోకి వచ్చేసినట్టే. కొన్ని రీషూట్స్ జరుపుకున్న ఈ సినిమాతో రవితేజ మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news