కథ :
అర్జున్ డ్రోన్ ఆపరేటర్ గా తన ఫ్యామిలీతో సంతోషకరమైన జీవితం గడుపుతుంటాడు. ఇక అనుకోని సంఘటనలతో తన అమమ్మనాన్నలను కోల్పోతాడు అర్జున్. మొదట యాక్సిడెంట్ వల్ల పేరెంట్స్ చనిపోయారని అనుకోగా ఆ తర్వాత అసలు విషయం తెలుస్తుంది. నాయక్ (శ్రీకాంత్) కావాలని వారిని చంపాడని తెలుస్తుంది. ఇక అతని మీద కక్ష్య కట్టిన అర్జున్ నాయక్ మీద యుద్ధమే శరణం అనుకుంటాడు. ఇంతకీ అసలు అర్జున్ పేరెంట్స్ ను నాయక్ ఎందుకు చంపుతాడు..? అర్జున్ నాయక్ ల వైరం ఎక్కడ మొదలైంది..? నాయక్ ను అర్జున్ ఏం చేశాడు అన్నది అసలు కథ.
నటీనటుల ప్రతిభ :
సినిమాలో అర్జున్ గా చైతు తన టాలెంట్ చూపించాడు. లుక్స్ పరంగా సినిమాలో చైతన్య స్టైలిష్ గా ఉన్నాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగా చేశాడు. ఇక హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిది అంత విషయమున్న పాత్ర అయితే కాదు. సెకండ్ హాఫ్ లో అయితే హీరోయిన్ ఉందా లేదా అన్నట్టు నడుస్తుంది. విలన్ గా శ్రీకాంత్ ఇరగ్గొట్టాడు. అయితే ఇంకా బాగా చేయించుకుని ఉండాల్సింది. లుక్స్ వైజ్ శ్రీకాంత్ విలన్ గా ఇంప్రెస్ చేశాడు. రావు రమేష్, రేవతిలు కూడా వారి పాత్రలకు చక్కని న్యాయం చేశారు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతికవర్గం పనితీరు :
సినిమా దర్శకుడు కథ అంతగా కొత్తగా ఏమి అనిపించదు. కథనంలో కూడా దర్శకుడు ఎక్కువ క్రియేటివిటీ చూపించలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఎడిటింగ్ కూడా ఇంకాస్త ట్రిం చేయాల్సి ఉంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి.
విశ్లేషణ :
రారండో వేడుక చూద్దాం సినిమాతో హిట్ అందుకున్న చైతు యుద్ధం శరణంతో ఆ హిట్ మేనియా కంటిన్యూ చేయాలని చూశాడు. దర్శకుడు కృష్ణ చెప్పిన కథనం నచ్చి సినిమా చేసిన చైతు ఫలితం అంత ఇంప్రెసివ్ గా లేదని చెప్పొచ్చు. రొటీన్ కథే ఒకవేళ కథనం అయినా ఆకట్టుకునేలా రాశారా అంటే అది కూడా అంతే లాగించేశారు. దర్శకుడు అన్నివిధలుగా విఫలమయ్యాడు. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ.. మిస్సింగ్ ఎంటర్టైమెంట్.. స్లో నేరేషన్ నెగటివ్ పాయింట్స్ అని చెప్పొచ్చు.
యుద్ధం శరణం ఇంప్రెస్ చేయలేదు..!
రేటింగ్ : 2/5