Gossipsవేశ్య పాత్ర నటించనున్నటాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

వేశ్య పాత్ర నటించనున్నటాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

ఒకప్పుడు హీరోయిన్ గా సదా ఓ వెలుగు వెలిగింది. హోమ్లీ లుక్ తో పాటు గ్లామరస్ పాత్రల్లో కూడా నటించింది. పాపం సదాకి ఇప్పుడు అవకాశాలు రావడం లేదు. దీంతో ఛాన్స్ ల కోసం తెగ ట్రై చేస్తోందట. ప్రస్తుతానికైతే అమ్మడు చేతిలో ఓ సినిమా ఉందని తెలుస్తుంది. అది కూడా ఓ డిఫరెంట్ ప్రయత్నంతో వస్తున్నా సినిమా.

సదా ప్రస్తుతం టార్చ్ లైట్ అనే మూవీలో నటిస్తోంది. ఈ మూవీ 1980ల నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో సదా వేశ్యపాత్రలో కనిపిస్తుందట. ఇక పాత్ర కోసం తన ఆహార్యం, డ్రెస్ సెన్స్ లలో వెరైటీ చూపించనుందట సదా.

ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ తిరునల్వేలి, కుట్రాలం పరిసరాల్లో గ్రామాల్లో జరుగుతోంది. లైఫ్ లో ఎంతో పైకి రావాలని కలలు గన్న ఓ అమ్మాయి అసలు వేశ్యగా ఎందుకు మారాల్సి వచ్చింది..? దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి..? అనేదే స్టోరీ అని టాక్. మొదట ఈ క్యారెక్టర్ చేయడానికి ససేమిరా అందట. డైరెక్టర్ కథ వినగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయట. దీంతో ఒకే చెప్పేశానని సదా చెబుతోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news