Moviesఉంగరాల రాంబాబు రివ్యూ ...

ఉంగరాల రాంబాబు రివ్యూ …

కమెడియన్ నుండి హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ కెరియర్ లో కాస్త వెనుకపడ్డాడని చెప్పాలి. హీరోగా తన ఇమేజ్ కు తగ్గ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సునీల్ హీరోగా వచ్చిన సినిమా ఉంగరాల రాంబాబు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.
కథ :
ట్రావెల్ ఎజెన్సీ నడిపించే రాంబాబు (సునీల్) తను నమ్మే బాదం బాబా సలహా మేరకే ఏ పని అయినా చేస్తుంటాడు. బిజినెస్ లో భారీ లాభాలను గడించిన రాంబాబు తనకు అదృష్టాన్ని తెచ్చే అమ్మాయి కోసం వెతుకుతాడు. ఈ క్రమంలో అతనికి సావిత్రి (మియా జార్జ్) తారస పడుతుంది. ఆమెను ప్రేమించిన రాంబాబు ఆమె ప్రేమను దక్కించుకునే క్రమంలో సావిత్రి తండ్రి రంగ (ప్రకాశ్ రాజ్) దగ్గరకు వెళ్తాడు. ఇక ఇద్దరి మధ్య ఏం జరిగింది..? రాంబాబు, సావిత్రిల ప్రేమను రంగా ఒప్పుకున్నాడా..? లేదా అన్నది అసలు కథ.
విశ్లేషణ :
ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తీసిన క్రాంతి మాధవ్ ఈ సినిమా కాలిక్యులేషన్ లో తప్పు చేశాడని చెప్పాలి. కమర్షియల్ పంథాలో కథనం నడిపించాలని చూసిన క్రాంతి మాధవ్ కథ కూడా రొటీన్ గానే రాసుకున్నాడు. ఇక మొదటి భాగం ఎంటర్టైనింగ్ తో సాగించినా సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా బోర్ ఫీలింగ్ తెలుస్తుంది. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ లాంటి మంచి నటుడిని పెట్టుకుని కూడా సినిమాను రక్తికట్టించలేదు.
తను రాసుకున్న రంగా క్యారక్టర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే విధంగా రాయడంలో మాత్రం సక్సెస్ అవ్వలేదు దర్శకుడు క్రాంతి మాధవ్. మిగతా సినిమాల కన్న సునీల్ ను ఈ సినిమాలో కామెడీ టైమింగ్ బాగున్నా సరే సినిమా కథ కథలాల్లో రొటీన్ అన్న భావన రాక మానదు. సునీల్ సినిమా అంటే కామెడీతో నడిపేయొచ్చు అన్న భావన దర్శకుడికి ఉన్నా సెకండ్ హాఫ్ లో సినిమా కొత్త టర్న్ తీసుకుని ప్రేక్షకుల సహనానికి పరిక్ష పెడుతుంది.
మొత్తానికి సినిమా అనుకున్న రేంజ్ అందుకోవడంలో విఫలమైందని చెప్పాలి. యూత్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలున్నా సెకండ్ హాఫ్ మాత్రం వారిని కూర్చోబెట్టే మ్యాటర్ లేదు.
నటీనటుల ప్రతిభ :
సునీల్ యధావిధిగా తన రోల్ లో ఆకట్టుకున్నాడు. ఇదవరకు హీరోగా చేసిన సినిమాల కన్నా ఇప్పుడు కాస్త అతి తగ్గించాడని చెప్పాలి. కథనం పరంగా సునీల్ క్యారక్టర్ అక్కడక్కడ చాలా వీక్ గా అనిపిస్తుంది. మొత్తానికి సునీల్ పరంగా సినిమాకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. మియా జార్జ్ పర్వాలేదు. ప్రకాశ్ రాజ్ మరో అద్భుతమైన పాత్రలో కనిపించారు. ఇన్ని సినిమాల కెరియర్ లో ప్రకాశ్ రాజ్ ను కమ్యునిస్ట్ లీడర్ గా చూపించిన సినిమా ఇదే అని చెప్పాలి. ఆయన పాత్రకు ఆయన న్యాయం చేశాడు. అయితే ఆయన్ను దర్శకుడు వాడుకున్న విధానం ఇంకా బాగుండాల్సింది అని తెలుస్తుంది. పోసాని, వెన్నెల కిశోర్ పాత్రలు ఆకట్టుకున్నాయి. మిగతా పాత్రలన్ని పర్వాలేదు అనిపించుకున్నారు.
రేటింగ్ : 2/5
మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news