Moviesస్పైడర్ ట్రైలర్ టాక్.. మురుగదాస్ మ్యాజిక్ తో మహేష్..!

స్పైడర్ ట్రైలర్ టాక్.. మురుగదాస్ మ్యాజిక్ తో మహేష్..!

మహేష్ మురుగదాస్ కాంబినేషన్ ఎనౌన్స్ చేసిన నాటి నుండి సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఆ అంచనాలను నిజం చేస్తూ టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం రిలీజ్ చేయాల్సిన ట్రైలర్ అనివార్య కారణాల వల్ల ముందే రిలీజ్ చేశారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ చేసిన స్పైడర్ ట్రైలర్ అంచనాలను అందుకుంది.

మురుగదాస్ మార్క్ సోషల్ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ కు పెద్ద పీఠ వేశారని చెప్పొచ్చు. మురుగదాస్ మ్యాజిక్ తో మహేష్ స్పైడర్ సంచలనాలను క్రియేట్ చేసేందుకు వస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం శిల్పకళావేదికలో నిర్వహించారు. ట్రైలర్ ఎలాగు వచ్చింది కాబట్టి ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ గా ఈ వేడుక జరుగనుంది.

సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న స్పైడర్ మహేష్ కు మంచి హిట్ మూవీ అవుతుందని అంటున్నారు. మరి పోటీగా తారక్ ఉన్నాడు కాబట్టి జై, స్పై లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news