వంద సినిమాలు పూర్తయ్యాక నందమూరి బాలయ్య సినిమాలు తీసే స్పీడ్ మరింత పెరిగింది. 101వ చిత్రం ‘పైసా వసూల్’ ఈమధ్యే విడుదలైంది.అనుకున్న విధంగా సినిమా సక్సెస్ కాకున్నా , బాలకృష్ణ క్యారెక్టర్ పరంగా వినూతనంగా అనిపించింది ప్రేక్షకులకి . ఈ సినిమా చూసిన ఆడియన్స్ అందరు బాలయ్య ఎలాంటి క్యారెక్టర్ ఐన అవలీలగా ప్లే చెయ్యగలడు అనిపించేంత బాగా చేసారు బాలయ్య ఈ సినిమాలో .
అయితే ఈ మధ్యే మొదలైన కె.ఎస్.రవికుమార్దర్శకత్వంలో 102వ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పీడ్ గ జరుగుతోంది. బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జీవిత కథకు సంబంధించిన స్క్రిప్టు పనులూ జరుగు తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడెవరనే విషయంలో జోరుగా చర్చ సాగుతున్నాయి . ‘త్వరలో దర్శకుడు ని అనౌన్స్ చేస్తానని బాలయ్య ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు .
ఇప్పుడు ఆ అన్వేషణకు ఫుల్స్టాప్ పడినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు తేజ చేతిలో పెట్టాలని బాలకృష్ణ నిర్ణయం తీసుకొన్నారని వినికిడి . ఇటీవల బాలకృష్ణ , తేజల మధ్య ఈ చిత్రానికి సంబంధించిన డిస్కషన్స్ జరిగాయి. ‘నేనే రాజు – నేనే మంత్రి’తో సక్సెస్ సాధించారు దర్శకుడు తేజ. తరవాత ఎవరితో సినిమా చేయాలన్న విషయంలో ఇంకా ఎలాంటి నిణయం తీసుకోలేదు. మరి ఎన్టీఆర్ జీవిత కథని తెరకెక్కించడానికి ఆయన ముందుకొస్తారా? లేదా? అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.