Gossipsఎన్టీఆర్ మల్టీస్టారర్ !!

ఎన్టీఆర్ మల్టీస్టారర్ !!

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ మొదటిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘జై లవకుశ’. వరుసగా నాల్గవ సక్సెస్ ను అందుకున్న తారక్ కారియర్ లో పీక్ దశలో వున్నాడు ఇప్పుడు . ఈ సినిమా థియేటర్లను హోరెత్తిస్తుంది.బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు సునామీని తలపిస్తున్నాయి . పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సినిమా పైన , తారక్ చేసిన నట పైన పాజిటివ్ కామెంట్స్ కూడా పెట్టాశారు అప్పుడే .

కాగా మొన్న  సినిమా ప్రమోషన్స్లో భాగంగా పలు  ఇంటర్వ్యూలలో  పాల్గొన్న యంగ్టైగర్ ఎన్టీఆర్ చాలా ఆసక్తికర విషయాలు బయటపెట్టారు .

‘సినీ ఇండస్ట్రీలో వారసత్వం ఒక్కటే సరిపోదు అని టాలెంటే కూడా ముఖ్యం అని చెప్పారు . నన్ను హీరో కావాలని నా తల్లిదండ్రులు ఫోర్స్ చెయ్యలేదు . నా ఇష్టంగానే టాలీవుడ్ కి  ఎంట్రీ ఇచ్చను అని . వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నా. హీరోల మధ్య పోటీ ఉన్నపుడే కదా ఆసక్తిగా ఉండేది. కాకపోతే ఆ పోటీ హెల్దీగ  ఉంటే మంచిది చెప్పారు ఆయన . మంచి కథతో సరైన దర్శకుడు వచ్చాడంటే మల్టీస్టారర్ సినిమా చేయడానికి వెనకాడను అని అన్నారు ఎన్టీఆర్ .

అయితే ఇప్పుడు ఇండస్ట్రీ లో ఒక చర్చ జరుగుతుంది .  పలువురు రచయితలూ  ఎన్టీఆర్ మల్టీ స్టార్రర్ కోసం కథలు రెడీ చేసే పనిలో పడ్డారని వినికిడి . టాలీవుడ్  ప్రముఖ దర్శకుడు ఒకరు  ఒక తమిళ్ స్టార్ హీరో ని సైతం సజెస్ట్ చేసినట్టు వినికిడి . మరి  వేచి చూడాలి ఆ మల్టీ స్టారర్ సినిమా లో ఎన్టీఆర్ తో  నటించబోయే ఆ తమిళ్  స్టార్ హీరో  ఎవరో..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news