పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా మరియు రాజకీయంగా ప్రతిపక్షాలు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన నిజాయితీని, నిబ్బదతని ఎవరు శంకించలేరు. దీనివల్లనే పవన్ అభిప్రాయాలలో మరియు ఆచరణలో క్లారిటీ లేకపోయినా పవన్ వ్యక్తిత్వం పై చాలామందికి విపరీతమైన అభిమానం. ఇదంతా ఎందుకంటే
ఇలాంటి పరిస్థుతులలో పవన్ లేటెస్ట్ గా చేసిన స్పందన వల్ల దాదాపు 150 కోట్ల దొంగ వ్యాపారానికి అడ్డు కట్ట పడింది అన్న కామెంట్స్ పొలిటికల్ గా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం పవన్ అభ్యర్ధన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యార్ధులకు సంబంధించి జారీ చేసిన జీవో 64 ను రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఎన్.జి.రంగ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్ధుల దృష్టిలో ప్రస్తుతం పవన్ రియల్ హీరోగా మారిపోయాడు. దీనికి సంబంధించి వివరాలలోకి వెళితే ప్రపంచంలో ఏ వ్యవసాయ యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందిన వారైనా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాన్ని పొందవచ్చు అన్న రూల్ ను పవన్ సూచనతో బ్రేక్ చేసి కేవలం ఎన్.జి.రంగ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులకే ఈ వ్యవసాయ శాఖ ఉద్యోగాలు వచ్చే విధంగా రూల్ ను మార్చారు.
దీనితో దాదాపు 3000 వేల వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు అనేక బోగస్ విదేశీ యూనివర్సిటీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాధించుకోవచ్చు. ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టిన అనేకమంది అక్రమార్కుల ఆలోచనలకు పవన్ స్పందనతో ప్రభుత్వం తీసుకొన్ననిర్ణయం ఊహించని షాక్ గా మారింది అని అంటున్నారు. ఈవిషయంలో పవన్ రంగంలోకి రాకుండా ఉండి ఉంటే దాదాపు 150 కోట్ల దొంగ వ్యాపారం ఈ బోగస్ ఫారెన్ యూనివర్సిటీ సర్టిఫికేట్ల పై జరిగి ఉండేది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
దీనితో మరికొందరు అయితే పవన్ పార్ట్ టైం పొలిటీషన్ గా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటే అవినీతి ఈవిధంగా అడ్డుకట్ట వేయబడుతూ ఉంటే నిజంగా పవన్ పూర్తి స్థాయి ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే అవినీతి ఇంకెంత కట్టడి అవుతుందో అంటూ పవన్ ను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు..