రేటింగ్ : 2.75/5
కథ :
తేడా సింగ్ (బాలకృష్ణ) తేడా తేడాగా ప్రవర్తిస్తూ లాయర్ పృధ్విరాజ్ ఇంటిని కావాలని లాక్కుంటాడు. అతను బాబ్ మార్లే (విక్రం జీత్) మనిషని తెలుసుకుని అక్కడ వారితో చేతులు కలుపుతాడు. ఇక ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటున్న ఇద్దరు ఆడమనుషులకు అండగా నిలుస్తాడు. హారిక (ముస్కన్) మొదట తేడా సింగ్ ను అపార్ధం చేసుకున్నా తర్వాత అర్ధం చేసుకుంటుంది. ఇక ఇంతలోనే ఇంటర్నేషనల్ డాన్ బాబ్ మార్లే ని చంపేందుకు పోలీసులు ఓ స్పెషల్ ఆఫీసర్ ను అపాయింట్ చేయాలని అనుకుంటారు. తేడా సింగ్ డేర్ నెస్ చూసి అందుకు నియమిస్తారు. కాని తేడా సింగ్ ఆల్రెడీ బాబ్ మార్లేతో గొడవ పడి వచ్చాడని తర్వాత తెలుస్తుంది. ఇంతజీ తేడా సింగ్ ఎవరు..? బాబ్ మార్లేని తేడా సింగ్ ఏం చేశాడు అన్నది అసలు కథ.
నటీనటుల ప్రతిభ :
తేడా సింగ్ గా బాలయ్య స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. పూరి పంచ్ డైలాగ్స్ కు బాలయ్య అభినయం ఫ్యాన్స్ ను సీట్లలో కూర్చోనివ్వదంటే నమ్మాలి. బాలయ్య వన్ మ్యాన్ షోగా అని చెప్పొచ్చు. క్యారక్టరైజేష కూటా ఇంతవరకు చూడని బాలయ్యను చూస్తాం. ఇక శ్రీయ పాత్ర కొద్దిసేపే అయినా ఆకట్టుకుంది. ముస్కన్ పాత్ర ఆకట్టుకుంది. కిరణ్ బేడి పోలీస్ గా పర్వాలేదు అనిపించగా విలన్ గా విక్రం జీత్ ఆకట్టుకున్నాడు. ఇక మినిస్టర్ గా చంద్రకాంత్ ఓకే. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించారు.
సాంకేతికవర్గం పనితీరు :
పూరి సినిమా అంటే యాక్షన్ సీన్స్ కు కొదవే ఉండదు. పైసా వసూల్ అంటూ పూరి బాలయ్య క్యారక్టరైజేషన్ మీదే కొత్తగా ట్రై చేశాడు. సినిమా కథ అంతగా గొప్పగా ఉండకపోయినా కథనం నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. మొదటి భాగం రేసీగా సాగుతుంది. సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. ముఖేష్ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. అనూప్ మ్యూజిక్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా వచ్చింది. ఎడిటింగ్ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉన్నాయి.
విశ్లేషణ :
పూరి మార్క్ సినిమాగా వచ్చిన పైసా వసూల్ బాలయ్యను కూడా తన దారిలోకి తీసుకెళ్లాడు. హీరో క్యారక్టరైజేషన్ బలంగా రాసుకున్న పూరి కథలో కొత్తదనం లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు. ఇక కథనం రేసీగా ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ కు ఈ సినిమా నచ్చే అవకాశాలున్నాయి. శాతకర్ణి తర్వాత బాలయ్య చేసిన ఈ పైసా వసూల్ నిజంగానే పైసా వసూల్ మూవీ అని చెప్పొచ్చు.
బాటం లైన్ :పైసా వసూల్ బాలయ్య కోసం మాత్రమే..!