Moviesఆ సినిమాను ఛత్రపతితో పోల్చాడు.. అంత సీన్ ఉందంటారా

ఆ సినిమాను ఛత్రపతితో పోల్చాడు.. అంత సీన్ ఉందంటారా

సినిమా ట్రైలర్ హంగామాలో దర్శకులను హీరోలను పొగడటం మాములే. పోలిక ఎలా ఉంటుందంటే అసలు సినిమా తీసిన దర్శక నిర్మాతలు కూడా ఆశ్చర్యపడేలా ఉంటుందన్నమాట. రీసెంట్ గా జయ జానకి నాయకా సినిమా ఆడియో ఫంక్షన్ లో గెస్ట్ గా వచ్చిన వినాయక్ ఈ సినిమా ట్రైలర్ ఛత్రపతి సినిమాలా ఉందని అన్నాడు. కచ్చితంగా ఇది ఆ హీరోని మోసేయడమే అని చెప్పాలి. రాజమౌళి ప్రభాస్ ల ఛత్రపతి ఎంత సెన్సేషనల్ హిట్టో తెలిసిందే. అలాంటిది ఈ సినిమా చూసి ఆ మాట అన్నా ఓకే కాని ట్రైలర్ చూసే ఈ ట్రైలరే ఛత్రపతి అంటే ఎలా అని కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ వినాయక్ మాటలను విమర్శిస్తున్నారు. తమ హీరో సినిమాతో పోల్చేంత దమ్ము ఆ సినిమాలో ఉందా అని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు.సరైనోడు తర్వాత బోయపాటి చేసిన ఈ సినిమా ఆగష్టు 11న రాబోతుంది. సినిమా యాస్ యూజువల్ గా బోయపాటి సినిమా ఎలాంటి ఊర మాస్ అంశాలతో ఉంటుందో అలానే దించినట్టు ఉంది. మరి వినాయక్ అన్న చత్రపతి రేంజ్ లో ఈ జయ జానకి నాయకా సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news