Moviesఐటం సాంగ్ కేరాఫ్ మిల్కీ బ్యూటీ.. ఎన్టీఆర్ తో అదిరిపోయే చాన్స్

ఐటం సాంగ్ కేరాఫ్ మిల్కీ బ్యూటీ.. ఎన్టీఆర్ తో అదిరిపోయే చాన్స్

ఓ పక్క హీరోయిన్ గా టాప్ రేంజ్ లో ఉంటూనే మరో పక్క ఐటం సాంగ్స్ తో అదరగొడుతున్నారు నేటితరం భామలు. సినిమాకు ఇచ్చేంత రెమ్యునరేషన్ ఒక్క సాంగ్ కే కోట్ చేయడంతో ఐటం అయినా సరే ఓకే అనేస్తున్నారు అందాల భామలు. ఈ ఐటం సాంగ్స్ క్రేజీగా మారేలా చేసిన బ్యూటీ తమన్నా. హీరోయిన్ గా చేస్తూనే బెల్లంకొండ బాబుతో రెండు సినిమాల్లో ఐటం అందాలను గుమ్మరించింది.

ఇక అదే దారిలో శృతి హాసన్, కాజల్ కూడా స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టారు. ఇక ఇప్పుడు తమన్నా మరో క్రేజీ మూవీలో ఐటం సాంగ్ చేయబోతుందట. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న జై లవ కుశలో తమన్నా ఐటం సాంగ్ కు ఓకే అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఐటం సాంగ్ కూడా చాలా స్పెషల్ గా ఉండబోతుందట. ఇక ఇదే కాకుండా కళ్యాణ్ రాం కొత్త సినిమాలో కూడా తమన్నా హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది.

పక్కా లోకల్ తో కాజల్ కు ఎలాంటి క్రేజ్ వచ్చిందో అంతకు రెట్టింపు క్రేజ్ జై లవ కుశ సినిమాలో తమన్నా సాంగ్ కు వస్తుందని అంటున్నారు. ఎన్.టి.ఆర్ తమన్నా ఊసరవల్లి సినిమాలో కలిసి నటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news