సుకుమార్, చరణ్‌ల చిత్రానికి ‘రంగస్థలం’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇది మిస్‌లీడింగ్ టైటిల్ అయ్యే ప్రమాదముందని, ‘రంగస్థలం’ అనే సరికి ఇదేదో నాటకాల బ్యాక్‌డ్రాప్‌కి చెందిన సినిమా అని అనుకుంటారని, కానీ ఇది పంతొమ్మిది వందల ఎనభైల కాలం నాటి లవ్‌స్టోరీ అంటూ సుకుమార్ చెబుతూ వచ్చాడు కదా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇందులో చరణ్ వినికిడి లోపమున్న పల్లెకారుడి పాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. సమంత ఏమో పల్లెటూరిలోని ఒక ఆసామి కూతురిగా కనిపించనుంది. జగపతిబాబు, ఆది పినిశెట్టి, ప్రకాష్‌రాజ్ వగైరా ప్రముఖ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి హాయిగొలిపే టైటిల్ ఏదో డిసైడ్ చేస్తాడని అనుకుంటూ వుంటే బరువైన ‘రంగస్థలం’ టైటిల్ పెట్టడానికి తోడు ‘1985’ అంటూ టైమ్ ఫ్రేమ్ కూడా జత చేసాడు. దీంతో ఈ చిత్రం ఎలాగుంటుందనే దానిపై కొత్త డౌట్లు రైజ్ అయ్యాయి.