బాలీవుడ్ హీరోయిన్ అనుమానాస్పద మృతి… అత్యాచారం.. హత్య ?

వెండితెరని ఏలుదామని ఎన్నో ఆశలతో 2013లో రాజో సినిమా ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బాలీవుడ్ నటి కృతిక చౌదరీ(30) అనుమానాస్పద స్థితిలో ముంబయి లోని సబర్బన్‌ అందేరిలోగల తన అధికారిక నివాసంలో మృతి చెంది ఉంది. మూడు రోజులుగా తాళం వేసివున్న తన గదిలోనుండి దుర్వాసన రావటంతో చుట్టుపక్కన ఉన్నవాళ్లు పోలీసులకు పిర్యాదు చేయడంతో, పోలీసులు వచ్చి తలుపులు బ్రద్దలు కొట్టి చూస్తే, దాదాపు కుళ్లిపోయి ఉన్న కృతికా చౌదరీ మృతదేహాన్ని గుర్తించారు. అత్యాచారం.. హత్య కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

ముంబయి కి చెందిన కృతిక ఈ మధ్యనే తన కెరీర్ ని వేగవంతం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.ఇంతలోనే ఇలా జరగడాన్ని చుట్టుపక్కలవాళ్ళు జీర్ణించుకోలేక పోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే నటి నటుల మరణాలు సంభవించడం చాలా బాధాకరం. తన మరణానికి కారణమైన వారికి శిక్షపడి, ఆమె ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Leave a comment