Newsమంత్రి నారాయణ కొడుకు యాక్సిడెంట్‌కి కారణమైన ‘కారు’ షాకింగ్ సీక్రెట్

మంత్రి నారాయణ కొడుకు యాక్సిడెంట్‌కి కారణమైన ‘కారు’ షాకింగ్ సీక్రెట్

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ బడాబాబుల కొడుకులు తొందరపాటు చర్యలకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నెమ్మదిగా అడుగులు వేయాల్సిన సమయంలో రయ్‌మంటూ పరుగులు తీస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీ మంత్రి నారాయణ కొడుకు కూడా ఇలాగే తన ప్రాణాల్ని బలి తీసుకున్నాడు. అతివేగంగా కారు నడుపుతూ ఓ స్థంభానికి ఢీకొట్టి, అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ మరణవార్త విని నారాయణ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చేతికి వచ్చిన కొడుకు తిరిగిరాని లోకాలకి వెళ్లిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇదిలావుండగా.. ఈ ప్రమాదానికి కారణమైన కారుకి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఆ కారు ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీల్లో ఒకటిగా పేరుగాంచిన ‘బెంజ్’ కంపెనీకి సంబంధించినదని తెలిసింది. అతను డ్రైవ్ చేసిన కారు ‘బెంజ్ జి-63 మోడల్’. తెలంగాణ రాష్ట్రంలో రిజిష్టర్ అయిన ఈ కారు నెంబరు టీఎస్ 07 ఎస్‌కే 7117. రెండు కోట్ల రూపాయిలకుపైనే ఖరీదైంది ఈ కారు. సాధారణంగా బెంజ్‌లోని ఈ శ్రేణి కార్లకు భద్రత చాలా పటిష్టంగా ఉంటుంది. అలాంటి అత్యుత్తమ శ్రేణికి చెందిన కారు అయినప్పటికీ.. నిషీత్ ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అయితే.. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువ కావడంతో నిషీత్ ప్రాణాలు కోల్పోయాడని అధికారులు చెబుతున్నారు. కారు మొత్తం దెబ్బ తినటంతోపాటు ఇంజిన్ భాగాలు సైతం మెలితిరిగిపోయాయి. దీన్ని బట్టి.. నితీష్ ఎంత వేగంగా కారుని నడిపాడో అర్థం చేసుకోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news