Moviesప్రభాస్ ‘బాహు’ రెమ్యునరేషన్ ముందు స్టార్స్ ‘బలి’

ప్రభాస్ ‘బాహు’ రెమ్యునరేషన్ ముందు స్టార్స్ ‘బలి’

వరుసగా రెండు మూడు విజయాలు వరిస్తే.. ఇండస్ట్రీలో హీరోల మార్కెట్ వ్యాల్యూ పెరుగుతుంది. ఇంకేముంది.. వాళ్లు తమకింత పారితోషికం ఇవ్వాల్సిందేనని అమాంతం పెంచేస్తారు. అలాంటిది.. ‘బాహుబలి’లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో దేశవ్యాప్తంగా అఖండ ప్రజాదరణ పొందిన ప్రభాస్ ఊరికే ఉంటాడా? కంపల్సరీ పెంచేస్తాడు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ రెబెల్‌స్టార్ తన పారితోషికాన్ని ఊహించని స్థాయిలో పెంచేశాడు.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘బాహుబలి’కి కేవలం 25 కోట్లు పారితోషికం తీసుకున్న ప్రభాస్, ఇకపై చేయబోయే సినిమాలకు రూ.30-35 కోట్ల మధ్య డిమాండ్ చేయాలని డిసైడ్ అయ్యాకట. ప్రస్తుతం ‘సాహో’ చిత్రం తన ఫ్రెండ్స్ బ్యానర్‌లోనే చేస్తున్నాడు కాబట్టి, రెమ్యునరేషన్ గురించి ఏం మాట్లాడలేదట. ఎంత వీలైతే అంత ఇవ్వమని చెప్పాడట. అయితే.. ఈ సినిమా తర్వాత చేసే చిత్రాలకు రూ.30 కోట్ల మేర తీసుకోవాలని ప్రభాస్ నిర్ణయం తీసుకున్నాడట. ‘బాహుబలి’తో ప్రభాస్‌కి దేశవ్యాప్తంగా సూపర్‌స్టార్ ఇమేజ్ వచ్చింది కాబట్టి.. అతని సినిమాలకు తెలుగుతోపాటు తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మంచి మార్కెట్ వుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభాస్ ఇలా తన రెమ్యునరేషన్‌ని అమాంతం పెంచేశాడని అంటున్నారు.

‘బాహుబలి’తో ఇండియన్ హిస్టరీలో సరికొత్త రికార్డులు రాసిన ప్రభాస్.. అనూహ్యంగా తన రెమ్యునరేషన్ పెంచేసి, అంతమొత్తం అందుకునే తొలి తెలుగు హీరోగా రికార్డుపుటలకెక్కాడు. ఇంతకుముందు ‘స్పైడర్’ చిత్రానికి రూ.25 కోట్లు తీసుకుని మహేష్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. పవన్ కూడా ‘కాటమరాయుడు’కి అంతే తీసుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరినీ వెనక్కు నెట్టేసి.. ప్రభాస్ తొలిస్థానంలో నిలిచాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news