Movies‘నేను లోకల్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. దుమ్ము దులిపేసిన నాని

‘నేను లోకల్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. దుమ్ము దులిపేసిన నాని

Natural star Nani’s latest film Nenu Local threatrical rights have been sold for massive price around the world.

ప్రస్తుత జనరేషన్ హీరోల్లో ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఫీట్‌ని నేచురల్ స్టార్ నాని అందుకున్నాడు. అదే.. గత రెండేళ్లలో వరుసగా ఐదు విజయాలు అందుకోవడం. అందుకే.. అతని లేటెస్ట్ ఫిల్మ్ ‘నేను లోకల్’కి మంచి డిమాండ్ ఏర్పడింది. పైగా.. సినిమాలపై మంచి పట్టు ఉన్న దిల్‌రాజు లాంటి అగ్ర నిర్మాత నిర్మించిన మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆ కారణంగానే.. ఈ మూవీ బాగానే బిజినెస్ చేసింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 19.7 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది.

విశేషం ఏమిటంటే.. ఈ మూవీ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ రూ.3 కోట్లకు అమ్ముడుపోవడం. నాని నటించిన గత సినిమాల్లో ఏ ఒక్కటీ ఈ రేంజు ధర పలకలేదు. నాని రెండు సినిమాలు అక్కడ 1 మిలియన్ క్లబ్‌లో చేరడం వల్లే.. యూఎస్ డిస్ట్రిబ్యూటర్ అంతమొత్తానికి తీసుకున్నట్లు తెలిసింది. ఇంకా చాలా ఏరియాల్లో ఈ చిత్రం నాని గత సినిమాలకంటే ఎక్కువ ధరే పలికాయి. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

నైజాం+వైజాగ్ : 7
సీడెడ్ : 2.25
ఈస్ట్ గోదావరి : 1.20
వెస్ట్ గోదావరి : 0.95
కృష్ణా : 1.20
గుంటూరు : 1.40
నెల్లూరు : 0.60
ఏపీ+నైజాం : రూ. 14.6 కోట్లు
ఓవర్సీస్ : 3
కర్ణాటక : 1.60
రెస్టాఫ్ ఇండియా : 0.50
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 19.7 కోట్లు

ప్రింట్స్, పబ్లిసిటీతో కలుపుకుని రూ.21 కోట్ల మార్క్ క్రాస్ అయ్యింది. ఈ లెక్కన.. ఈ చిత్రం రూ.22 కోట్లపైన కలెక్ట్ చేస్తే, సేఫ్ జోన్‌లోకి చేరుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news