Newsమసాజ్ సెంటర్‌లో వ్యభిచారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

మసాజ్ సెంటర్‌లో వ్యభిచారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

Hyderabad LB nagar police raids on message center in vanasthalipuram and arrested 9 members along with manager who is running prostitution from a long time.

రేప్‌ల రాజధానిగా ఢిల్లీకి ముద్ర పడినట్లుగానే.. వ్యభిచార గృహాలా అడ్డాగా హైదరాబాద్‌కీ పేరు పడిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. ఒకప్పుడు బ్రోతల్ హౌస్‌లే లేని ఈ నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అవే దర్శనమిస్తున్నాయి. పోలీసులు రెగ్యులర్‌గా దాడులు నిర్వహిస్తున్నప్పటికీ.. వాటి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు. చోటు ఏదైనా తమకు అనుకూలంగా అనిపిస్తే చాలు.. అక్కడ గుట్టుగా ప్రాస్టిట్యూషన్ నిర్వహిస్తున్నారు. ఇలాగే మసాజ్ సెంటర్ ముసుగులో ఓ నిర్వాహకుడు వ్యభిచారం నడిపిస్తుండగా.. పోలీసులు తాజాగా రైడ్ చేసి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సనామా సెంటర్ వద్దనున్న ఒక కాంప్లెక్స్‌లో ఓ నిర్వాహకుడు మసాజ్ సెంటర్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా చాలాకాలం నుంచి వ్యభిచారం నడిపిస్తూ వస్తున్నాడు. ఈ విషయం ఇటీవల ఎల్బీనగర్ జోన్ ఎస్‌వోటీ పోలీసుల చెవిన పడింది. దాంతోవారు బుధవారం సాయంత్రం ఆకస్మికంగా ఆ మసాజ్ సెంటర్‌పై దాడి చేశారు. తనిఖీల్లో భాగంగా.. సెంటర్ నిర్వాహకుడితోపాటు 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబట్ట వారిలో ముగ్గురు యువతులు ఉన్నారు. వారివద్దనున్న కొంత నగదు స్వాధీనం చేసుకుని.. వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news