Moviesబాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 21 రోజుల కలెక్షన్స్ వివరాలు

బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 21 రోజుల కలెక్షన్స్ వివరాలు

Gautamiputra Satakarni 3 weeks Telugu states collections report has been out.

సంక్రాంతి కానుకగా 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఇప్పటికీ డీసెంట్ వసూళ్లతో దూసుకెళుతోంది. బాక్సాఫీస్ వద్ద 3 వారాలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. అన్ని రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 49.28 కోట్లు కొల్లగొట్టింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య సినిమా ఆ రేంజ్ వసూళ్లు రాబట్టడం ఇదే మొదటిసారి. ఫైనల్‌గా.. బాలయ్య తొలిసారి ఏపీ, తెలంగాణాల్లోనే రూ.50 కోట్ల మార్క్‌ని అందుకోబోతున్నాడు. ఇక మిగిలిన ఏరియాలన్నీ కలుపుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా శాతకర్ణి కలెక్షన్లు రూ.66 కోట్లకుపైగానే చేరి ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఏరియాల వారీగా 21 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 11.90
సీడెడ్ : 9.31
ఉత్తరాంధ్ర : 7.05
ఈస్ట్ గోదావరి : 4.35
వెస్ట్ గోదావరి : 4.56
కృష్ణా : 4.17
గుంటూరు : 5.24
నెల్లూరు : 2.70
టోటల్ ఏపీ + తెలంగాణ : రూ. 49.28 కోట్లు

Latest news