డాక్టర్‌ని వేశ్యగా మార్చిన ‘ఓ యాడ్’.. విచారణలో వెలుగుచూసిన షాకింగ్ ట్విస్ట్

one ad turns bangalore doctor life to prostitute

Sanjeev posted an advertisement on the name of Doctor Supriya, mentioned that she is a prostitute. And also provide all details of her in ad. Finally, police caught him and took to the custody.

ఆమె ఒక డాక్టర్. కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. వీరి సంసార జీవితం మొదట్లో బాగానే సాగింది కానీ.. ఆ తర్వాత విభేదాలు తలెత్తాయి. తరచూ గొడవలు జరుగుతుండడంతో.. భర్తతో విడాకులు తీసుకుంది. భర్తతో విడిపోయాక తల్లిదండ్రులతో కలిసి వున్న ఆమె.. ఇటీవల రెండో పెళ్ళి చేసుకోవాలని అనుకుంది. మ్యాట్రిమొనియల్ వెబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చింది. అదే ఆమెకు పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. మొదట ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. కొన్నిరోజుల తర్వాత ఆమెకి వందలాది ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. ‘ఎంత అడిగితే అంత డబ్బిస్తాం.. మాతో పడుకుంటావా’ అని ప్రతిఒక్కరూ ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు. ఆ వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా.. విచారణలో భాగంగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. తనకు ఆ ఫోన్ కాల్స్ రావడానికి కారణం ఒకడేనని తెలిసి ఆమె ఖంగుతింది. ఇంతకీ అతనెవరు? ఆమెను ఎందుకు వేధించాడు? ఈ వివరాలన్నీ తెలియాలంటే.. మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన సుప్రియ (పేరు మార్చాం) ఓ ఆసుపత్రిలో డెంటిస్ట్‌గా పనిచేస్తోంది. ఆమె ఇద్దరు పిల్లలు. విభేదాల కారణంగా భర్తతో విడాకులు తీసుకున్న ఆమె.. తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది. మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించమని పేరెంట్స్ ఆమెకు సూచించారు. వారి సూచన మేరకు సుప్రియ ఓ మ్యాట్రిమొనియల్ వెబ్‌సైట్‌లో తన ఫోటోతోపాటు అన్ని వివరాలు ఉంచిది. సుప్రియ ప్రొఫైల్ చూసిన సంజీవ్ అనే వ్యక్తి.. ఆమెతో ఫోన్‌లో మాట్లాడాడు. తాను పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు. తల్లిదండ్రులతో మాట్లాడి తన అభిప్రాయం చెబుతానని ప్రియ అతనికి చెప్పింది. ఈ విషయం తన పేరెంట్స్‌కి సుప్రియ చెప్పగా.. కుటుంబసభ్యులు అందరూ సంజీవ్ ప్రొఫైల్ పరిశీలించారు. అన్ని వివరాలు చూశాక.. అతడు సరిజోడి కాదని తేల్చేశారు. ఇదే విషయాన్ని సంజీవ్‌కు చెప్పింది సుప్రియ. సంజీవ్ కనీసం ఫ్రెండ్స్‌గానైనా ఉందామని సుప్రియపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో.. దీంతో అసలు ఉద్దేశమేంటని సంజీవ్‌ను ఆమె ప్రశ్నించింది. ‘పెళ్లి ఎలాగో చేసుకోవడం లేదు కదా కనీసం ఒక్క రోజైనా తనతో గడపాలని’ సంజీవ్ నీచంగా మాట్లాడాడు. అతడు చెప్పిన ఆ మాట విని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన సుప్రియ.. అతడ్ని హెచ్చరించింది. మరోసారి ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది.

అయినా సంజీవ్ ఆమె మాటను పట్టించుకోకుండా పదే పదే ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. చివరికి సుప్రియ తనని పట్టించుకోవడం లేదని గ్రహించిన సంజీవ్.. మరో నీచానికి ఒడిగట్టాడు. ‘సుప్రియ ఫోటోతోపాటు ఆమె వివరాలన్నీ జత చేసి.. శృంగారంపై ఆసక్తి ఉన్న మగవారు ఈమెను సంప్రదించవచ్చు’ ఇంటర్నెట్‌లో ఓ యాడ్‌ పెట్టాడు. అప్పటినుంచి ఆమెకి రెగ్యులర్‌గా వందలాది ఫోన్‌లు రావడం మొదలయ్యాయి. ‘తమతో పడుకుంటే.. ఎంత డబ్బైనా ఇస్తాం’ అని వేధించసాగారు. ఆ వేధింపులు తాళలేక ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. సంజీవ్ బాగోతం బట్టబయలైంది. ఆ యాడ్ ఇచ్చింది అతడేనని పోలీసులు తేల్చారు. అతనిని అదుపులోకి తీసుకుని.. కేసు విచారిస్తున్నారు.

Leave a comment