Ram Charan Tej’s latest movie Dhruva 28 days collections were registered 41.09cr share in Andhra Pradesh and Telangana.
రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘ధృవ’ సినిమా సక్సెస్ఫుల్గా ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ట్రేడ్ నిపుణులు ఈ మూవీకి సంబంధించిన నాలుగు వారాల కలెక్షన్స్ వివరాల్ని వెల్లడించారు. వారి లెక్కల ప్రకారం.. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తం 28 రోజుల్లో రూ.41.09 కోట్లు కలెక్ట్ చేసింది.
జనవరి 1వ తేదీ తర్వాత డీమోనిటైజేషన్ ఎఫెక్ట్ అంతగా లేకపోవడంతో.. ఈ చిత్రం డీసెంట్ వసూళ్లతో దూసుకెళుతోంది. పైగా.. విడుదలైన ఇతర చిత్రాలకి యావరేజ్ టాక్ రావడంతో ‘ధృవ’కి బాగా కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వీకెండ్లో ఏ ఇతర సినిమాలు రిలీజ్ అవ్వలేదు కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద ‘ధృవ’ హవానే నడుస్తుంది. ఏరియాలవారీగా నాలుగు వారాల్లో ఈ చిత్రం కలెక్ట్ చేసిన కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. (కోట్లలో)
నైజాం : 15.32
సీడెడ్ : 6.70
ఉత్తరాంధ్ర : 5.36
ఈస్ట్ గోదావరి : 3.16
వెస్ట్ గోదావరి : 2.75
కృష్ణా : 2.96
గుంటూరు : 3.50
నెల్లూరు : 1.34
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 41.09 కోట్లు (షేర్)