Moviesతాను ఏడ్చేరకం కాదంటున్న ఎన్టీఆర్

తాను ఏడ్చేరకం కాదంటున్న ఎన్టీఆర్

మనం ఎంతో కష్టపడి చేసిన పనికి సరైన ఫలితం దక్కకపోతే కచ్చితంగా కుంగిపోతాం.. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేనంత తీవ్ర మనోవేదనకు గురి అవుతాం.. కొన్నాళ్లు ఎవరితో సంప్రదింపులు చేయకుండా ఒంటరిగా గడుపుతాం.. కానీ తన మెంటాలిటీ అలాంటిది కాదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటున్నాడు. తాను చేసిన సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే బాధపడతానంటున్న తారక్.. దానిగురించే ఆలోచిస్తూ అనవసరంగా సమయం వృధా చేసుకోనని, తర్వాత ఏం చేయాలన్న దానిపై ఫోకస్ పెడతానని తాజాగా ఓ మేగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

‘నా సినిమా ఫ్లాప్ అయినపుడు బాధపడతాను. కానీ.. దాని గురించే ఆలోచించుకుంటూ నిద్ర పాడుచేసుకోవడం లాంటివి చేయను. వీలైనంత త్వరగా దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తా. నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను మరింత బాగా చేయాలని ఆలోచిస్తా’ తారక్ వెల్లడించాడు. ఇక ఒత్తిడి సమయాల్లో తాను కుకింగ్ చేస్తానని, అలా చేయడం వల్ల తాను రిలాక్స్‌గా ఫీల్ అవుతానని అన్నాడు. షూటింగ్స్ లేని సమయాల్లో తన కొడుకుతో కలిసి షాపింగ్ కూడా చేస్తానని తెలిపాడు. ఇక తన తర్వాతి చిత్రం గురించి తారక్ మాట్లాడుతూ.. ట్రెండ్‌కు తగ్గట్లుగా మారాల్సిన సమయం ఇదని, తనని అభిమానులు ఏవిధంగా కోరుకుంటున్నారో ఆవిధంగా కనిపిస్తానని ఎన్టీఆర్ అన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news