Movies"శ్రీమంతుడు"ని కోర్టుకు లాగిన రచయిత..?

“శ్రీమంతుడు”ని కోర్టుకు లాగిన రచయిత..?

Directer Koratala Siva, hero Maheshbabu, producer Erneni Navin has got the summons from Nampally court. Srimanthudu movie released in 2012 and got succeeded in telugu film industry. Writer sharath chandra registered a case on srimanthudu story at nampally court.

కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు సినిమా విడుదల అయిన అతి తక్కువ సమయంలోనే తనదైన మార్కుతో తెలుగు సినిమా రికార్డులను తిరగరాసి కలెక్షన్ల పరంగా చరిత్రలో రెండో స్థానాన్ని దక్కించుకుంది.అంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి కూడా కష్టాలు తప్పేట్టులేవు.శ్రీమంతుడుకి పనిచేసిన దర్శక నిర్మాతలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీచేసింది. అసలు విషయంలోకి వెళ్తే శ్రీమంతుడు సినిమా కథ తాను రచించిన ప్రేమ నవలను ఆధారంగా చేసుకుని సినిమా తీసారని రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కాగా ఒక ప్రముఖ వార పత్రికలో 2012లో తాను రాసిన “చచ్చేంత ప్రేమ” నవలను తన అనుమతి తీసుకోకుండా సినిమాని నిర్మించి కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారని వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోర్టును ఆశ్రయించారు.

శరత్ చంద్ర వేసిన ఫిర్యాదును నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. శ్రీమంతుడు సినిమా కథానాయకుడు మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ,నిర్మాత ఎర్నేని నవీన్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఐపీసీ 120 బి,మరియు కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 కింద నాంపల్లి కోర్టు కేసు నమోదు చేసింది. తదుపరి విచారణకు మహేష్ బాబు, కొరటాల శివ, ఎర్నేని నవీన్ కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news