‘ఖైదీ నెం.150’ 7 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.. చెలరేగిపోయిన చిరంజీవి

khaidi no 150 7 days worldwide collections report

Megastar Chiranjeevi’s 150th film Khaidi No 150 first week worldwide collections report is out. According to trade, This film has crossed 78 crore mark only in it’s 7 days run.

పదేళ్ల తర్వాత ‘ఖైదీ నెం.150’తో సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. రావడం రావడంతోనే చెలరేగిపోయాడు. తాను బరిలోకి దిగితే ఏ రికార్డైనా చితికిపోవాల్సిందేనని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. దేనికోసమైతే మెగాఫ్యాన్స్ ఇన్నాళ్లు వేచి చూస్తూ వస్తున్నారో.. ఆ దాహాన్ని ఈ ఒక్క సినిమాతోనే తీర్చేశాడు. కేవలం 7 రోజుల్లోనే ఊహకందని కలెక్షన్లు కొల్లగొట్టి.. బాక్సాఫీస్‌ని రఫ్పాడించేశాడు. ఇతర స్టార్ హీరోలు టోటల్ రన్‌టైంలో కూడా రాబట్టలేని భారీ వసూళ్లను వారంలోనే వసూలు చేశాడు.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ‘ఖైదీ’ సినిమా ఏడు రోజుల్లో రూ. 78.65 కోట్లు కలెక్ట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ. 57.03 కోట్లు రాబట్టడం విశేషం. నిజానికి.. రిలీజైన రోజు సినిమా మీద క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. అనవసరమైన కామెడీ చేర్చి, స్టోరీ ట్రాక్ తప్పేలా చేశారని విమర్శలు కూడా వినిపించాయి. కానీ.. మెగాస్టార్ స్టామినా ముందు అవి చిన్నబోయాయి. బాస్ రీఎంట్రీ ఇచ్చారన్న సంతోషంతోనే జనాలు థియేటర్లపై ఎగబడ్డారే తప్ప.. సినిమా టాక్ ఎలా ఉందన్న విషయాన్ని పట్టించుకోలేదు. అందుకే.. ఈ చిత్రం ఈ రేంజులో కలెక్షన్ల సునామీ సృష్టించిందని అంటున్నారు.

కేవలం ఏడురోజుల్లోనే ఈ సినిమా రూ.78.65 కోట్లు కలెక్ట్ చేయడాన్ని బట్టి చూస్తుంటే.. ఇది త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు వచ్చిన వసూళ్లని బట్టి చూస్తే.. చాలా ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కి చేరిపోయింది. కొన్నిచోట్ల ఆల్రెడీ సేఫ్ జోన్‌లోకి వెళ్లింది. ఇంకొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కి దగ్గరలో ఉంది. అంటే.. టోటల్ రన్‌లో అన్ని చోట్లా లాభాల పంట పండడం ఖాయం.

ఏరియాలవారీగా 7 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 14.50
సీడెడ్ : 10.86
ఉత్తరాంధ్ర : 8.40
ఈస్ట్ గోదావరి : 6.34
గుంటూరు : 5.51
వెస్ట్ గోదావరి : 4.87
కృష్ణా : 4.13
నెల్లూరు : 2.42
ఏపీ+తెలంగాణ : రూ. 57.03 కోట్లు
ఓవర్సీస్ : 12.75
కర్ణాటక : 7.47
రెస్టాఫ్ ఇండియా : 1.40
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 78.65 కోట్లు (షేర్)