Newsవిరిగిన ‘మనసు’కి తండ్రితో ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్న నిహారిక

విరిగిన ‘మనసు’కి తండ్రితో ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్న నిహారిక

Niharika Konidela started a new web series named Nanna Koochi with her Daddy Nagababu.

మెగాఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. మొదటి సినిమా ‘ఒక మనసు’తోనే తన ఫేట్ మారిపోతుందని భావించింది. ఆల్రెడీ బుల్లితెర యాంకర్‌గా, ‘ముద్దపప్పు ఆవకాయ్’ యూట్యూబ్ వెబ్-సిరీస్‌ ద్వారా బోలెడంత పాపులారిటీ రావడంతో.. అది సినీ కెరీర్‌కి ఎంతో హెల్ప్ అవుతుందని అనుకుంది. సినీజనాలు కూడా.. నిహారిక టైం స్టార్ట్ అయ్యిందని అనుకున్నారు. కానీ.. ఎప్పుడైతే ఆ సినిమా రిలీజయ్యిందో అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ చిత్రం 2016లోనే డిజాస్టర్‌గా నిలిచింది. ఆ దెబ్బకు నిహారిక కెరీర్ ఒక్కసారిగా బోల్తాపడింది. దాంతో.. తర్వాత ఏం చేయాలన్న ఆలోచన కోసమే నిహారిక చాలా సమయం కేటాయించింది.

చివరికి చాలా గ్యాప్ తర్వాత ఈ అమ్మడు ఓ అరుదైన నిర్ణయం తీసుకుంది. ‘ఒక మనసు’తో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందడం కోసం ‘నాన్న-కూచీ’ అనే మరో యూట్యూబ్ వెబ్-సిరీస్ ప్రారంభించింది. ఒక తండ్రికి, కూతురికి మధ్య సంబంధం నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో నాగబాబు ‘నాన్న’ పాత్రని పోషిస్తున్నారు. స్వయంగా తన నాన్నే అయితే ఈ సిరీస్‌కి మరింత ఆదరణ వస్తుందన్న ఉద్దేశంతో.. నిహారిక ఆయన్ను తీసుకుంది. తండ్రీకూతుళ్ల మధ్య రిలేషన్‌ని చాలా సరదాగా, హార్ట్ టచింగ్ సన్నివేశాలతో ఈ సిరీస్‌ని చిత్రీకరిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా ప్రారంభమైంది. త్వరలోనే ఇది రిలీజ్ కాబోతోంది. ఈ ‘నాన్న-కూచి’తోనైనా నిహారిక సక్సెస్ బాట పడుతుందా? లేదా? వేచి చూద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news