Movies‘ఖైదీ నెం.150’ ఫస్ట్ వీకెండ్ (5 రోజులు) కలెక్షన్స్.. రెండు రేర్...

‘ఖైదీ నెం.150’ ఫస్ట్ వీకెండ్ (5 రోజులు) కలెక్షన్స్.. రెండు రేర్ రికార్డ్స్ క్రియేట్ చేసిన బాస్

Chiranjeevi’s khaidi no 150 movie five days worldwide collections report is out. According to this report, Khaidi has created two non-baahubali records. Read below article to know more details

బాస్ అడుగుపెడితే గత రికార్డులన్నీ బద్దలైపోతాయని అనుకున్నాం కానీ.. మరీ ఈ రేంజులో సునామీ సృష్టిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. తొలిరోజు ఏకంగా ‘బాహుబలి’నే బీట్ చేసిన చిరు.. ఆ తర్వాతి రోజుల్లో కూడా ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టాడు. దీంతో.. ఫస్ట్ వీకెండ్ (ఐదు రోజులు) రన్‌లోనే ‘ఖైదీ’ సినిమా రెండు ‘నాన్-బాహుబలి’ రికార్డుల్ని క్రియేట్ చేసింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ‘ఖైదీ’ సినిమా ఐదు రోజుల్లో రూ.52.17 కోట్లు సాధించింది. ఇంత తక్కువ టైంలో ఈ రేంజ్‌లో ‘బాహుబలి’ తప్ప మరే సినిమా కలెక్షన్లు రాబట్టలేదు. ఇప్పటివరకు ‘జనతా గ్యారేజ్’ సినిమా 5 రోజుల్లో రూ.35 కోట్లకుపైగా కలెక్షన్లతో ‘బాహుబలి’ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు ‘ఖైదీ’ 50 కోట్లకుపైగా కలెక్షన్లతో తారక్ రికార్డ్‌ని బ్రేక్ చేసి రెండో స్తానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇక కర్ణాటక, ఓవర్సీస్, ఇంకా ఇతరత్ర ఏరియాలను కలుపుకుని టోటల్ వరల్డ్‌వైడ్‌గా ‘ఖైదీ’ సినిమా రూ. 71.79 కోట్లు కొల్లగొట్టింది. కేవలం 5 రోజుల్లో ‘బాహుబలి’ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ‘ఖైదీ నెం.150’నే. దీన్నిబట్టి.. పదేళ్లు గ్యాప్ వచ్చిన చిరు స్టామినా ఏమాత్రం తగ్గలదేని అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి.. అందరూ భావించినట్లుగానే బాస్ బాక్సాఫీస్‌ని ఏలుతున్నాడు.

ఏరియాల వారీగా 5 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 15.83
సీడెడ్ : 8.58
నెల్లూరు : 2.04
కృష్ణా : 3.34
గుంటూరు : 4.67
వైజాగ్ : 8.15
ఈస్ట్ గోదావరి : 5.37
వెస్ట్ గోదావరి : 4.19
ఏపీ+తెలంగాణ : రూ. 52.17 కోట్లు
కర్ణాటక : 7.80
రెస్టాఫ్ ఇండియా : 1.50
యూఎస్ఏ : 7.23
రెస్టాఫ్ వరల్డ్ : 3.09
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 71.79 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news