Movies‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ వీకెండ్ (4 రోజులు) కలెక్షన్స్.. సాహో బాలయ్య

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ వీకెండ్ (4 రోజులు) కలెక్షన్స్.. సాహో బాలయ్య

Balayya’s 100th movie Gautamiputra Satakarni first weekend collections report is out.

బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బాక్సాఫీస్‌ని ఓ కుదుపు కుదిపేస్తోంది. ఏ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిందో.. వాటిని అందుకోవడంలో సక్సెస్ అవ్వడం వల్ల ఇది కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాలయ్య మార్కెట్ వ్యాల్యూ కంటే ఎక్కువ వసూళ్లే రాబడుతోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ఫస్ట్ వీకెండ్ (4 రోజుల)లో రూ.25.93 కోట్లు కొల్లగొట్టింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రికార్డ్ ఫిగర్. ఆయన గత సినిమాల్లో ఏ ఒక్కటీ ఇంత తక్కువ టైంలో అంతమొత్తం వసూళ్లు రాబట్టలేదు. ఈ చిత్రానికి అన్నిచోట్ల నుంచి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడం వల్లే ఇలా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి విజువల్ వండర్‌ని కేవలం 79 రోజుల్లోనే దర్శకుడు క్రిష్ కంప్లీట్ చేయడం గర్వించదగ్గ విషయం. ఇక ‘శాతకర్ణి’ పాత్రలో బాలయ్య ఒదిగిపోయిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. శ్రియా శరన్, హేమమాలిని ప్రధాన పాత్రలో పోషించిన ఈ సినిమా 4 రోజుల కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)…

నైజాం : 6.98
సీడెడ్ : 5.37
గుంటూరు : 3.07
ఉత్తరాంధ్ర : 2.66
వెస్ట్ గోదావరి : 2.42
ఈస్ట్ గోదావరి : 2.15
కృష్ణా : 2.03
నెల్లూరు : 1.24
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 25.93 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news