Megastar Chiranjeevi has reached another milestone with his prestigious 150th project Khaidi No 150 in Telugu states. According to report, this film crossed 75 crore mark in AP/TG in just 19 days.
బాక్సాఫీస్ వద్ద బాస్ కుమ్ముడు ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడో వీకెండ్‌లోనూ ఆయన ప్రతిష్టాత్మక 150వ చిత్రం చెప్పుకోదగ్గ వసూళ్లే రాబట్టింది. ఈ నేపథ్యంలో ట్రేడ్ వర్గాలు ఓవరాల్‌గా 19 రోజుల (ఏపీ+తెలంగాణ) కలెక్షన్స్ వివరాలను వెల్లడించాయి. వీరి లెక్కల ప్రకారం.. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 75.57 కోట్లు కలెక్ట్ చేసింది. కేవలం 19 రోజుల్లోనే.. అది కూడా ఏపీ, తెలంగాణాల్లో ఇంతమొత్తం కలెక్ట్ చేయడం బాస్‌కే చెల్లిందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. ఇంత తక్కువ టైంలో రెండు రాష్ట్రాల్లో 75 కోట్ల మార్క్‌ని క్రాస్ చేసిన రెండో చిత్రంగా ‘ఖైదీ’ నిలిచి.. మరో ‘నాన్-బాహుబలి’ రికార్డ్ సృష్టించింది. చూడబోతే.. ఈ చిత్రం టోటల్ రన్‌టైంలో రూ.80 కోట్ల మార్క్‌ని కూడా క్రాస్ చేయడం ఖాయమని అంటున్నారు.
ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా రూ.100 కోట్ల షేర్ రాబట్టి ‘నాన్-బాహుబలి’ రికార్డ్ క్రియేట్ చేసిన ‘ఖైదీ’.. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఇంకో అరుదైన ఘనత సాధించబోతోందన్నమాట. మొత్తానికి.. అందరూ అనుకున్నట్లుగానే మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ చిత్రంతో సంచలనాలే సృష్టించాడు. తమిళ ‘కత్తి’కి రీమేక్‌గా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం పోషించిగా.. ఆయన సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించింది. ‘కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ’ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా 19 రోజుల కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)..
నైజాం : 19
సీడెడ్ : 14.65
నెల్లూరు : 3.27
గుంటూరు : 7.04
కృష్ణా : 5.51
వెస్ట్ గోదావరి : 5.82
ఈస్ట్ గోదావరి : 7.83
ఉత్తరాంధ్ర : 12.45
ఏపీ+తెలంగాణ : రూ. 75.57 కోట్లు