Moviesశాతకర్ణికి హైకోర్టు నోటీసులు...ఎందుకో తెలుసా.?

శాతకర్ణికి హైకోర్టు నోటీసులు…ఎందుకో తెలుసా.?

Andhrapradesh government and Gauthamiputra Satakarni movie producer Rajivreddy has got the summons from High court for tax exemption in Andhrapradesh state. As we know this was directed by Krish and released on 12th January 2017 and Nandamuri Balakrishna played lead role. Shreya plays actress role opposite to Balayya. this movie comes under historic drama genre.

ఈ నెల 12 న విడుదల అయిన నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచం మొత్తం విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. తెలుగువారి చరిత్రను ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేసిన శాతకర్ణుడి చరిత్ర ఆదారంగా నిర్మితమైన సినిమా. ఈ సినిమాకు దర్శకుడిగా జాగర్లమూడి క్రిష్, నిర్మాతగా రాజీవరెడ్డి, కథానాయకుడిగా నందమూరి బాలకృష్ణ నటించి అలరించగా ఆయనకు తోడుగా శ్రేయ నటించింది.అలాంటి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలు పన్ను మినహాయింపును ఇచ్చాయి.

కానీ ఈ సినిమా నిర్మాతకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇస్తూ నిర్మాతకు, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.ఎలాంటి జీవో లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఎందుకు ఇచ్చింది.అలా పన్ను మినహాయింపు ఇవ్వడంపై దాఖలైన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు విచారించింది.ఏ నిబంధనలు పాటించకుండా పన్ను మినహాయింపు ఎలా ఈ చిత్రానికి ఇచ్చారు అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు దీనిపై తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news